తాడికొండలో వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం | Janasena Activists Attack Ysrcp Leader In Tadikonda Guntur | Sakshi
Sakshi News home page

తాడికొండలో వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

Aug 2 2026 10:52 AM | Updated on Aug 2 2026 11:59 AM

Janasena Activists Attack Ysrcp Leader In Tadikonda Guntur

సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గంలో దారుణం జరిగింది. మేడికొండూరు మండలం డోకిపర్రులో వైఎస్సార్‌సీపీ నేత రత్తయ్యను చంపేందుకు జనసేన నేతలు యత్నించారు. రత్తయ్య తల, ముఖంపై రాళ్లతో దాడి చేసిన జనసేన మూకలు.. ఆయన చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తుపట్టి.. రత్తయ్యను ఆసుపత్రికి తరలించారు.

20 రోజుల క్రితం రత్తయ్య ఇంటిపై జనసేన మూకలు దాడి చేశారు. రత్తయ్య తన ఇంటి ముందు వైఎస్సార్‌సీపీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్‌ తీసేయాలని రత్తయ్యను జనసేన నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో జనసేన నేతలపై ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో​ జనసేన నేతలపై గ్రీవెన్స్‌లో రత్తయ్య ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రత్తయ్యపై రాత్రి విచక్షణారహితంగా రాళ్లు, కర్రలతో​ దాడి చేశారు. రత్తయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement