ప్రియురాలి కూతురిపై కన్నేసిన ప్రియుడు | Extramarital affair Incident In anantapur | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కూతురిపై కన్నేసిన ప్రియుడు

Aug 2 2026 8:43 AM | Updated on Aug 2 2026 9:26 AM

Extramarital affair Incident In anantapur

గాయపడిన ఆటో డ్రైవర్‌ సురేష్‌

అనంతపురం సెంట్రల్‌: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె కూతురిపైనా కన్నేశాడు. బలాత్కారం చేసేందుకు యత్రించగా యువతి తల్లి అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ సురేష్‌ స్థానిక డ్రైవర్స్‌ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆ మహిళ కుమార్తెపైనా కన్నేశాడు. ఈ విషయాన్ని బాలిక పలుమార్లు తల్లికి చెప్పింది. 

దీంతో ఆమె తన కుమార్తె జోలికి వెళ్లొద్దని ప్రియుడిని హెచ్చరించింది. అయినా అతను పద్ధతి మార్చుకోలేదు. శుక్రవారం సురేష్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత మహిళ బాత్‌రూంకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తెను బలాత్కారం చేసేందుకు యతి్నంచాడు. బాధితురాలు కేకలు వేయడంతో తల్లి పరుగున వచ్చి అడ్డుకోబోయింది. 

అయినప్పటికీ అతను విరమించుకోకపోవడంతో కత్తితో మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి, స్థానికుల సాయంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement