Live Updates
మరికాసేపట్లో కర్నూలుకు వైఎస్ జగన్
కూటమి సర్కార్ కుట్రలు..
- వైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వం కుట్రలు
- జనం రాకుండా అడ్డుకునేందుకు పోలీసులతో అడ్డంకులు
- అన్ని మార్గాల నుండి వస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు
- జనాన్ని అడ్డుకునేందుకు వందలాది పోలీసుల మోహరింపు
- పోలీసులు ఆంక్షలను దాటుకుంటూ కర్నూలుకి వస్తున్న వై ఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు
- వైఎస్ జగన్ పర్యటనలో జనసందోహన్ని చూసి ఉలిక్కిపడ్డ ప్రభుత్వం
- నిన్న పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- ఈరోజు ఉదయం నుండి మొదలైన పోలీసుల అణచివేత చర్యలు
2026-08-13 08:54:38
పోలీసుల ఆంక్షలు..
- కర్నూలులో పోలీసుల ఆంక్షలు..
- వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు..
- నందవరం మండలం హాలహార్వి టోల్‌గేట్ వద్ద పోలీసుల తనిఖీలు.
- మంత్రాలయం నియోజకవర్గం నుంచి జగనన్న పర్యటనకు స్వచ్ఛందంగా వెళ్తున్న వాహనాలు నిలిపివేత..
- ప్రత్యామ్నాయ దారుల్లో తమ అభిమాన నేతను చూసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు.
2026-08-13 08:52:34
వైఎస్ జగన్ పర్యటనపై కుట్రలు
- వైఎస్ జగన్ పర్యటనపై కుట్రలు
- జగన్‌ను చూసేందుకు జనం రాకూడదని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షారోన్‌లు హెచ్చరికలు
- కాదు కూడదని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్.
- వైఎస్ జగన్‌కు కర్నూలు జైలులో ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉందన్నారు.
- రోడ్‌షోలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు.
- 30 యాక్ట్ అమలులో ఉన్నందున జగన్‌ను చూసేందుకు జనం హాజరు కాకూడదన్నారు.
- జనం రాకుండా పోలీసులు హెచ్చరికలు పంపుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం.
2026-08-13 08:40:53
పర్యటన ఇలా..
- వైఎస్ జగన్ పర్యటన ఇలా..
- వైఎస్ జగన్ ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అక్కడి నుంచి రాక్‌గార్డెన్, నన్నూరు, టోల్‌ప్లాజా, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, సంతోష్ నగర్, పుల్లూరు సర్కిల్ మీదుగా పంచలింగాల వద్ద ఉన్న జిల్లా జైలుకు చేరుకుంటారు.
- ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో కలిసి పరామర్శిస్తారు.
- అక్కడే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతోనూ మాట్లాడతారు.
2026-08-13 08:40:53
మరికాసేపట్లో కర్నూలుకు వైఎస్ జగన్
- నేడు కర్నూలుకు వైఎస్ జగన్
- ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్
- అక్రమ కేసులో జైలులో ఉన్న ఆయనకు పరామర్శ
2026-08-13 08:40:53
Advertisement


