టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయాలపాలయ్యారు. తన భుజానికి గాయం తగలడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దాంతో వైద్యులు ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఈ విషయం ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కానీ ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లీడర్ ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వెంటనే ట్వీట్లు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ గాయాలపై మాత్రం మౌనం వహించడంతో మానవత్వం లేదా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై చూపిన ప్రేమాభిమానాల్లో కనీసం పదో వంతు కూడా అత్యంత దగ్గరి బంధువైన ఎన్టీఆర్‌పై చూపలేదని బాబు, లోకేశ్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


