‘ధర్మేంద్ర తరహాలోనే లోకేష్‌ రాజీనామా చేయాలి’ | YSRCP Demand Nara Lokesh To Resign Over DSC Issue | Sakshi
Sakshi News home page

‘ధర్మేంద్ర తరహాలోనే లోకేష్‌ రాజీనామా చేయాలి’

Jul 25 2026 4:19 PM | Updated on Jul 25 2026 4:31 PM

YSRCP Demand Nara Lokesh To Resign Over DSC Issue

విజయవాడ:  ఏపీలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తుంది. లోకేష్‌పై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం స్పష్టత ఇ‍వ్వాలని, ఇప్పటివరకూ డీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఆ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. 

డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహించాల్సిన నారా లోకేష్‌ మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని, రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించింది. విచారణ నుంచి తప్పించుకోవడం అనుమానాలకు తావిస్తోందని, టీచర్‌ పోస్టుల కోసం బేరసారాల వీడియోలు బయటకొచ్చినా నామమాత్రపు కేసులతో విచారణను నీరుగార్చారని  వైఎ‍స్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని, ఇందులో నిజాలు నిగ్గు తేల్చే వరకూ ప్రజా ఉద్యమం కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement