‘నారా లోకేష్‌ కూడా రాజీనామా చేయాలి’ | YSRCP Leader Jakkampudi Raja Demands Nara Lokesh to Resign | Sakshi
Sakshi News home page

‘నారా లోకేష్‌ కూడా రాజీనామా చేయాలి’

Jul 25 2026 3:50 PM | Updated on Jul 25 2026 4:04 PM

YSRCP Leader Jakkampudi Raja Demands Nara Lokesh to Resign

తూర్పు గోదావరి జిల్లా:  నీట్‌ పేపర్‌ లీక్‌ అంశానికి సంబంధించి సీజేపీ ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారని, ఆయన్ని అనుసరిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్‌ చేశారు. ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమేనని, దానికి నారా లోకేష్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. 

జాతీయ నేత ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదర్శంగా తీసుకుని నారా లోకేష్‌ కూడా రాజీనామా చేయాలన్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్య పార్టీ కాబట్టి వారిని అనుసరిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ తక్షణమే లోకేష్‌ రాజీనామా చేయాలని, ఆలా చేయకపోతే యువత ఆగ్రహానికి లోకేష్‌ గురి కావాల్సి వస్తుందన్నారు. 

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement