తాడేపల్లి: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేసిన ఆందోళనల వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది నిరుద్యోగులతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యతవహిస్తూ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌లో చంద్రబాబును ప్రశ్నించారు.
‘‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2026


