‘డీఎస్సీలో అక్రమాలపై లోకేష్‌ రాజీనామా చేయాలి’ | YSRCP demands Lokeshs resignation immediately | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీలో అక్రమాలపై లోకేష్‌ రాజీనామా చేయాలి’

Jul 25 2026 7:21 PM | Updated on Jul 25 2026 7:34 PM

YSRCP demands Lokeshs resignation immediately

ప్రకాశం: డీఎస్సీలో అక్రమాలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్‌ చేశారు. ఆంధ్రాలో డీఎస్సీలో అవకతవకలకి బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. 

నిరుద్యోగులను మోసం చేసిన లోకేష్‌ పదవిలో ఉండటానికి వీల్లేదన్నారు. లోకేష్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, యువత ఉద్యమించాలన్నారు. ఈ నెల 28వ తేదీన లోకేష్‌ రాజీనామా కోరుతూ ఆంధోళనలను ప్రారంభిస్తామన్నారు జూపూడి. డిఎస్సి అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించి...లోకేష్ రాజీనామా కూడా చేయాలన్నారు. రాష్టంలోను కాక్రోచ్ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు జూపూడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement