యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? కూటమి ప్రభుత్వంపై సెటైర్లు | Prakash Raj Reacts UAPA Section On Youtuber Ravan | Sakshi
Sakshi News home page

Prakash Raj: దిగజారుతూ ఉండండి.. ప్రజలు మీ ఆట ముగిస్తారు

Jul 6 2026 12:55 PM | Updated on Jul 6 2026 3:21 PM

Prakash Raj Reacts UAPA Section On Youtuber Ravan

నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ 'ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావుతో మొద‌లుపెట్టిన మీ ఆట‌ను ముగించేది ప్ర‌జ‌లే" అని వ్యాఖ్యానించారు. నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినా UAPA సెక్ష‌న్‌తో రిమాండ్‌లోకి పంపడంపై మండిపడ్డారు. 'యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా?' అని, జనసైనికులు ఇప్పటికే ఏఐ వీడియోలతో క్యారెక్టర్ అససినేషన్ మొదలుపెట్టారని ఆరోపించారు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్‌కి తమిళ నేత వార్నింగ్)

'వరసగా తప్పుడు కేసులు పెట్టి నాలుగుసార్లు కోర్ట్ బెయిల్ ఇస్తే UAPA వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఇది ప్రశ్నించే గొంతులని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ అర్థమైంది. తర్వాత ఏంటి? వ్యక్తిగత దూషణ. ఆల్రెడీ జనసైనికులు ఏఐ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వాడి ఫోన్ మీ దగ్గరుంది. అందులో సమాచారాన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకు అండగా నిలుచున్న వాళ్లని, ఎన్నో ప్రశ్నించే గొంతులని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత దిగజారతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలే ఇస్తారు. గేమ్ ఆన్' అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

రావణ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్.. ప్రకాష్ రాజ్ ఏమన్నారు?

(ఇదీ చదవండి: అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement