హిందూపురంలో టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు | TDP leader misdeeds with minor girls in Hindupur | Sakshi
Sakshi News home page

హిందూపురంలో టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు

Feb 16 2026 4:22 AM | Updated on Feb 16 2026 4:22 AM

TDP leader misdeeds with minor girls in Hindupur

బాలికలకు వీడియో కాల్స్‌ చేసి ప్రైవేటు పార్ట్స్‌ చూపించాలని టార్చర్‌

సీఎం బావమరిది, మంత్రి లోకేశ్‌ మామ నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో టీడీపీ కార్యకర్త దారుణాలు

రాష్ట్రంలో రోజురోజుకు శ్రుతిమించుతున్న కూటమి నేతల ఆగడాలు

సాక్షి, పుట్టపర్తి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వికృతక్రీడ మరువక మునుపే సీఎం చంద్రబాబు బావ­మరిది, మంత్రి లోకేశ్‌ మామ, ఎ­మ్మెల్యే నందమూరి బా­లకృష్ణ ప్రాతి­నిధ్యం వహిస్తున్న శ్రీసత్య­సాయి జిల్లా హిందూపురం నియోజక­వర్గంలోని చిలమత్తూరు మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగేంద్ర మైనర్‌ బాలికలతో సాగించిన వికృత చేష్టలు బయటపడ్డాయి. బాలి­కలతో బలవంతంగా శృంగారం చే­స్తూ, వాటిని స్వయంగా వీడియోలు తీశాడు. 

వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్స్‌ మాట్లాడడం, ప్రైవేటు పార్ట్స్‌ చూపించ­మని ఒత్తిడి చేసి రాక్షసానందం పొందిన వీడియోలు వైరల్‌గా మారాయి. నాగేంద్ర వీడియో కాల్స్, నేరుగా శృంగార వీడియోలు తీయడం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో టీడీపీ నేతల వికృత చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాలి­కలకు సంబంధించిన వీడియోలు తీయడమే నేరమను­కుంటే.. వాటిని ఎలా బయటకు పంపించారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. బ్లాక్‌మెయిల్‌ చేయడానికి అమ్మాయిల వీడియోలు తీసి ఉండవచ్చన్న అనుమా­నాలు రేకెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement