తిరునాళ్లలో బెల్టుషాపు | illegal belt shops operating at Balakoteswara Swamy Temple | Sakshi
Sakshi News home page

తిరునాళ్లలో బెల్టుషాపు

Feb 16 2026 5:06 AM | Updated on Feb 16 2026 5:06 AM

illegal belt shops operating at Balakoteswara Swamy Temple

ఆలయం వెనుక ఏర్పాటు చేసిన బెల్టుషాపు (ఇన్‌సెట్‌లో) వేలాడుతున్న మద్యం బాటిళ్లు

జి.కొండూరు: టీడీపీ మద్యం మాఫియా బరితెగించింది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం వెల్వడంలో శివరాత్రి పురస్కరించుకొని బాలకోటేశ్వరస్వామి ఆలయం వద్ద తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. అలాంటి పవిత్రమైన దేవాలయం వెనక భాగాన పార్కింగ్‌ ప్రదేశంలో ఆదివారం ఏకంగా బెల్టుషాపు ఏర్పాటు చేశారు.

దీంతో దేవాలయానికి వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరునాళ్లలో బెల్టుషాపు ఏర్పాటు చేయడమేంటని మండిపడ్డారు. ఆదాయం తప్ప భక్తుల మనోభావాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement