జోగి రమేష్ అరెస్ట్ అప్‌డేట్స్..
జోగి రమేష్ సహా మరో ఇద్దరు అరెస్ట్..
- విజయవాడ..
- మాజీ మంత్రి జోగి రమేష్ సహా మరో ఇద్దరిని అక్రమ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.
- జోగి రమేష్‌తో పాటు అతని సోదరుడు జోగి రాము అక్రమ అరెస్ట్
- జోగి రమేష్ ప్రధాన అనుచరుడు అరేపల్లి రాము అరెస్ట్
- భవానిపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్న అధికారులు
మాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..
- చంద్రబాబు రాక్షసానందం పొందడానికే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.
- తప్పు చేయలేదని నా భార్య, పిల్లల మీద ప్రమాణం చేశాను.
- అయినా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.
- కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసేందుకు కుట్ర ఇది.
- అందుకే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.
ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ తరలింపు..
- మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
- నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు
- జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిట్
- విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపు
- జోగి రమేష్ సోదరుడు రామును సైతం అరెస్ట్ చేసిన పోలీసులు.
- తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆగ్రహం.
- జోగి రమేష్ అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన
- ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసన

జోగి రమేష్ అరెస్ట్..
మాజీ మంత్రి జోగి రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.
మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.
- జోగి రమేష్ అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆందోళన.
జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కామెంట్స్..
- పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు.
- మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు.
- చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య.
- నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి.
- మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి.
👉మాజీ మంత్రి జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్దకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
👉మాజీ మంత్రి జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం ఓవరాక్షన్‌కు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను ఇరికించే కుట్రకు తెరలేపింది. ఏ1 జనార్థనరావు స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయనను ఇరికించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్‌పై అక్రమ కేసు పెట్టింది.
👉అయితే, ఇప్పటికే నకిలీ మద్యం విషయంలో సీబీఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం విశేషం. కాగా, ఏ1 జనార్థనరావు రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ ప్రస్తావన లేకపోవడం ఈ కేసులో కీలక పరిణామం. జనార్థనరావు జైలుకి వెళ్లాక కుట్ర పూరితంగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ఎల్లో మీడియా, టీడీపీ ఆఫీస్ ద్వారా వీడియోను బయటకు వదిలారు.

👉కాగా, నకిలీ లిక్కర్ డాన్ జనార్థనరావు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జనార్థనరావుతో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిదికి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వసంతను జనార్థనరావు కలిశారు. జనార్థనరావు సమక్షంలోనే తంబళ్లపల్లె జయచంద్రారెడ్డికి చంద్రబాబు బీఫామ్ కూడా ఇచ్చారు. చంద్రబాబుతో ఏ1 జనార్థనరావు దిగిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలను తప్పించి కూటమి సర్కార్ వైఎస్సార్‌సీపీ నేతలపైకి కేసు డైవర్షన్ చేసింది. సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. సిట్ వేసిన వెంటనే జనార్థనరావు వీడియోను విడుదల చేశారు. ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టుకథను అమలు చేస్తున్నారు. ఇక, మద్యం ఫ్యాక్టరీ పెట్టిన టీడీపీ ఇన్‌ఛార్జ్ జయచంద్రారెడ్డిని, ఆయన బావ మరది గిరిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.



