
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్‌పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.
పచ్చ నేత కల్తీ మద్యం డెన్‌ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ఎక్సైజ్ ఎస్‌ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్‌తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది.
