Live Updates
సుప్రీం కోర్టు కన్నా చంద్రబాబు గొప్పేంకాదు: వైఎస్ జగన్
సుప్రీం కోర్టు కంటే చంద్రబాబు గొప్పేం కాదు : వైఎస్ జగన్
పక్కా పథకం ప్రకారం జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది
పెట్రోల్, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేశారు
టీడీపీ నేత ఫతావుల్లా బాటిళ్లతో జోగి రమేష్‌ను ధ్వంసం చేశారు
ఫతావుల్లా,ఆశ టీడీపీ టీడీపీ నేతలు
ఆశ కుమార్తె పెళ్లికి చంద్రబాబు ముఖ్య అతిధిగా వచ్చారు
పోలీసు సమక్షంలో జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది
పోటీసులు, టీడీపీ గూండాలు కుమ్మక్కై జోగి ఇంటిపై దాడి చేశారు
పోలీసులతో కలిసి ఫతావుల్లా,ఆశలు జోగి రమేష్ ఇంటిపై పెట్రల్, ఇతర రసాయనాలతో దాడులకు తెగబడ్డారు
అక్రమకేసులకు సంబంధించి కోర్టులో హాజరయ్యేందుకు వెళ్తున్న జోగి రమేష్ తంబళ్లపల్లి వెళ్లారు
తన ఇంటిపై దాడి జరగబోతుందని సీపీకి ఇతర పోలీసులకు ఫోన్ చేస్తే స్పందించలేదు
అంబటి నివాసంలో సాయంత్రం ఐదుగంటల నుంచి అర్ధరాత్రి 1గంటవరకు దహనకాండ జరిగింది
ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది
కళ్లుమూసి కళ్లు తెరిచేలోపే వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమో
అధికారంలోకి వచ్చిన వెంటనే నాయకులు,పోలీసులు,గూండాల్ని ఊపేక్షించం
న్యాయస్థానంలో నిలబెడతాం
చిప్ సరి చేసుకోమన్నందుకే జోగిరమేష్‌పై దాడి చేశారు
చిప్ సరిగ్గా లేకనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు
చిప్ సరిగ్గా లేకనే సీబీఐ రిపోర్టుపై అసత్య ప్రచారం చేశారు
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సీబీఐ పనిచేసింది
లడ్డూపై చంద్రబాబు వక్రబుద్దిపై, అన్యాయంపై వైవి సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించింది
సుప్రీం కోర్టు సీబీఐని రంగంలోకి దించింది
సీబీఐ తీర్పు సైతం లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించింది
తనకు అనుకూలంగా సీబీఐ రిపోర్టు ఇవ్వలేదని ఏకసభ్య కమిషన్ వేస్తున్నారు
సుప్రీం కోర్టు కంటే చంద్రబాబు గొప్పేం కాదు
ఇలా అబద్ధాలాడుతూ పోతే చంద్రబాబు ప్రజల్లో చులకనవుతారు
చంద్రబాబులో అసహనం పెరిగిపోతుంది
కేంద్ర సంస్థలేతిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేశాయి
తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు లేదని,టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమనలు తప్పు చేయలేదని నిర్ధారించింది
తప్పు చేయలేదు కాబట్టి సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో వారి పేర్లను నమోదు చేయలేదు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నెయ్యి అంశంలో జరిగిన అవకతవకల గురించి సీబీఐ చెప్పింది
తిరుమల జంతువుల కొవ్వు ఉందని ఎవరు చెప్పారు సీబీఐ చెప్పిందా? లేదు
మరి అలా చెప్పింది ఎవరు చంద్రబాబు, నారాలోకేష్,పవన్ కళ్యాణ్
సీబీఐ రిపోర్ట్ వచ్చిన వెంటనే చేసిన తప్పుకు చంద్రబాబు లెంపలేసుకోవాల్సింది
సీబీఐ ఛార్జ్‌షీట్ ఫైల్‌లో చంద్రబాబు హాయాంలో నెయ్యి వ్యవహారంలో తప్పు జరిగిందని చెప్పింది
కేంద్ర సంస్థలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదనితేల్చాయి
చంద్రబాబులో అసహనం పెరిగిపోతుంది
తిరుమల లడ్డూ గురించి ఫ్లెక్సీలు పెట్టి అసత్య ప్రచారం చేశారో మీరూ చూశారు
లడ్డూలో చేసిన తప్పును ప్రశ్నించిన అంబటి,జోగి రమేష్‌తో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు
వెంకటేశ్వర స్వామిని అవమానించిన వ్యక్తి చంద్రబాబు: వైఎస్ జగన్
సమాజం జంగిల్ రాజ్ పరిపాలన చూసి తలవంచుకునేలా చంద్రబాబు చేశారు
అంబటి రాంబాబు అన్న నివాసంలో కార్లను ధ్వంసం చేశారు
అంబటి కుటుంబసభ్యుల్ని దూర్బాషలాడారు
మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది
అంబటి రాంబాబు నివాసంలో జంగిల్ రాజ్ పాలన జరిగినట్లే జోగి రమేష్ ఇంట్లో జరిగింది
దీన్ని బట్టి చూస్తే అర్ధ అవుతుంది చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నారు
మేం చెప్పేది కాదు సీబీఐ చంద్రబాబు అబద్ధాల్ని తేటతెల్లం చేసింది
వెంకటేశ్వర స్వామిని అవమానించిన వ్యక్తి చంద్రబాబు
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అన్యాయంగా దుష్టప్రచారం చేశారు
వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టను దిగజార్చింది చంద్రబాబే
రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటున్నది చంద్రబాబే
జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న వైఎస్ జగన్


మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో వైఎస్ జగన్
జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న జగన్
జోగి రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్న జగన్
పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో వైఎస్ జగన్

జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్
ఇటీవల జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో టీడీపీ గూండాల దాడి
పెట్రోల్ బాంబుల దాడి జరిగిన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలిస్తున్న వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్డు నుంచి జోగి రమేష్ ఇంటి వరకు కిక్కిరిసిన జనం
వైఎస్ జగన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం
జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం
జనసంద్రంలా జోగి రమేష్ ఇంటి పరిసర ప్రాంతాలు
వైఎస్ జగన్ రాకతో కిక్కిరిసిన ఇబ్రహీంపట్నం
జగన్ రాకతో కిక్కిరిసిన ఇబ్రహీంపట్నం
జోగి రమేష్ కు సంఘీభావంగా కదం తొక్కిన కేడర్
జోగి రమేష్ ఇంటిని పెట్రోలు బాంబులతో తగులపెట్టిన టీడీపీ గూండాలు
జంగిల్ రాజ్ కు వ్యతిరేకంగా ఏకమైన జనం
ప్రభుత్వంపై వెల్లువెత్తుత్తిన జనాగ్రహం
రెడ్ బుక్‌ను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చిన జనం
తాడేపల్లి నుండి ఇబ్రహీంపట్నానికి 35 కి.మీ.
35 కిలోమీటర్ల దూరానికి ఐదున్నర గంటల ప్రయాణం
అడుగడుగునా వెల్లువెత్తిన అభిమానంతో ఆలస్యంగా కొనసాగుతున్న జగన్ పర్యటన
ఇబ్రహీంపట్నం సర్కిల్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- ఇబ్రహీంపట్నం సర్కిల్‌కు చేరుకున్న జననేత వైఎస్ జగన్
- ఇబ్రహీంపట్నంలో వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం
- వేలాదిగా తరలివచ్చిన వైఎస్ జగన్ అభిమానులు
- కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నంలోకి వైఎస్ జగన్ కాన్వాయ్
ఎన్టీఆర్ జిల్లా :
- ఇబ్రహీంపట్నంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్
- జోగి రమేష్ ఇంటిని పరిశీలించనున్న జగన్
- ఇటీవల టీడీపీ గూండాల పెట్రోల్ బాంబుల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని పరిశీలించనున్న వైఎస్ జగన్
మరి కాసేపట్లో ఇబ్రహీంపట్నం చేరుకోనున్న వైఎస్ జగన్
ఎన్టీఆర్ జిల్లా:
- మరి కాసేపట్లో ఇబ్రహీంపట్నంకు వైఎస్ జగన్
- జోగి రమేష్ ఇంటిని పరిశీలించనున్న జగన్
- ఇటీవల టీడీపీ గూండాల పెట్రోల్ బాంబుల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని పరిశీలించనున్న వైఎస్ జగన్
- జగన్ కాన్వాయ్ వెంట భారీ జన సందోహం
- ప్రజలే ముందుండి జగన్‌ను నడిపిస్తున్న వైనం
- జగన్ కోసం భారీగా తరలివచ్చిన కార్యకర్తలు , అభిమానులు
- జనసంద్రంగా మారిన ఇబ్రహీంపట్నం రింగ్
గుంటుపల్లి చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
గుంటుపల్లి చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
వైఎస్ జగన్ వెంట భారీగా జనం
కార్లు,బైక్‌లతో జగన్ వెంట వస్తున్న యువత
మంగళగిరి బైపాస్ వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
- మంగళగిరి బైపాస్ వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
- జగన్ కాన్వాయ్ వెంట భారీగా జనం
- బైకులు, కార్లతో జగన్ వెంట వస్తున్న యూత్
జగన్ కాన్వాయ్ వెంట భారీగా జనం
- బైకులు, కార్లతో జగన్ వెంట వస్తున్న యూత్
- ప్రాతూరు వద్ద చెక్‌పోస్టు పెట్టి వాహనాల అడ్డగింత
- చెక్ పోస్టును చేధించుకుని మరో మార్గంలో వచ్చిన జనం
- జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా ఒక్కటయిన ప్రజలు
హైవే మీదకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
- ప్రాతూరు వద్ద పోలీసుల చెక్‌పోస్టు
- జగన్ కాన్వాయ్‌తో వస్తున్న కార్లు, బైకులను నిలిపేస్తున్న పోలీసులు
వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగునా పోలీస్ ఆంక్షలు
- ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల తీరుపై తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ఆగ్రహం
- ప్రజాస్వామ్యంలో ఇలా అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ మండిపాటు
జోగి రమేష్ ఇంటికి బయల్దేరిన వైఎస్ జగన్
- తాడేపల్లి నుంచి కాజా, వెస్ట్ బైపాస్, గొల్లపూడి మీదగా
- ఇబ్రహీంపట్నం చేరుకోనున్న వైఎస్ జగన్
- ఇటీవల జోగి రమేష్ ఇంటి వద్ద టీడీపీ గూండాల బీభత్సం
- పెట్రోల్ బాంబులతో ఇంటిని తగలబెట్టిన టీడీపీ గూండాలు
- జోగి రమేష్, కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్
వైఎస్ జగన్ పర్యటనతో ప్రభుత్వంలో వణుకు: జోగి రమేష్
- చివరి నిమిషంలో పోలీసులు రూటు మార్చారు
- జగన్ పర్యటనకు జనం స్వచ్ఛందంగా వస్తారు
- చంద్రబాబు ఆదేశిస్తే పోలీసుల అత్యుత్యాహం ఎందుకు?
- పెట్రోల్ బాంబులతో నా కుటుంబాన్ని మట్టుబెట్టాలని చూశారు
- లోకేష్ అరాచకాలను జనం చూస్తున్నారు
జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా..
- నేడు జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్
- ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ జంగిల్ రాజ్
- జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాల పెట్రోల్ బాంబ్ దాడి
- నివాసాన్ని పరిశీలించి.. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
- జోగి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించే అవకాశం
- జగన్ పర్యటన నేపథ్యంలో మరోసారి తెర మీదకు పోలీసుల ఆంక్షలు
- జన సమీకరణ జరగకుండా వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు
- చివరి నిమిషంలో జగన్ పర్యటన రూట్ మార్చాలంటూ జోగి రమేష్‌కు నోటీసులు
- పోలీసుల విజ్ఞప్తికి అంగీకరించిన వైఎస్ జగన్
- జగన్ పర్యటనలకు పోటెత్తుతున్న జనసంద్రం
- ఆ ఆదరణను ఓర్వలేకే పోలీస్ వ్యవస్థతో కూటమి ప్రభుత్వం కుట్రలు
- జగన్ కోసం జనం రావడం ఆగదంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు
జోగి రమేష్ కుటుంబానికి రోజా, వరుదు కల్యాణి పరామర్శ
- జోగి రమేష్ కుటుంబానికి అండగా వైఎస్సార్‌సీపీ
- ఇటీవల జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాల పెట్రోల్ బాంబు దాడి
- జోగి రమేష్ నివాసానికి వెళ్లిన ఆర్కే రోజా, వరదు కల్యాణి
- ధ్వంసమైన నివాసాన్ని పరిశీలించిన మహిళా నేతలు
- అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జంగిల్ రాజ్‌పై మండిపాటు
ఇదీ చదవండి: చంద్రబాబు, పవన్‌ను వెంకటేశ్వరస్వామి క్షమించడు
ఎన్ని చేసిన జనాల్ని ఆపలేరు: వెల్లంపల్లి
- మరికాసేపట్లో జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్
- ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద టీడీపీ గూండాల విధ్వంసం
- జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్
- చివరి నిమిషంలో రూట్ మార్చాలన్న పోలీసులు
- పోలీసుల విజ్ఞప్తితో అందుకు అంగీకరించిన వైఎస్ జగన్
- తాడేపల్లి నుంచి కాజా, వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకోనున్న జగన్
- ఎన్ని చేసినా జగన్ కోసం జనం రావడం ఆగదన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
పోలీసులకు ఆ హక్కు ఎక్కడిది?: నల్లగట్ల స్వామిదాస్
- వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనలో అడుగడుగున పోలీస్ ఆంక్షలు
- తిరువూరు నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నంకు వస్తున్న వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల తీరుపై తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ఆగ్రహం
- ప్రజాస్వామ్యంలో ఇలా అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని మండిపడ్డ స్వామిదాస్
వైఎస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు
- నేడు జోగి రమేష్‌ను పరామర్శించనున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్సార్‌సీపీ నేతలు హాజరు కాకుండా నోటీసులు
- ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుకి నోటీసులు
- అర్ధరాత్రి నోటీసులిచ్చిన పోలీసులు
- ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దంటూ నోటీసుల్లొ పేర్కొన్న పోలీసులు
కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్
- పోలీసుల విజ్ఞప్తితో రూటు మార్చుకున్న జగన్
- వైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వం కుట్రలు
- అకస్మాత్తుగా రూట్ మార్చాలంటూ పోలీసుల నోటీసులు
- నోటీసులు జారీ చేసిన విజయవాడ సీపీ
- గుంటూరు జన ప్రభంజనం దెబ్బకి కుట్రలకు తెరలేపిన ప్రభుత్వం
- తాడేపల్లి నుంచి కాజా, వెస్ట్ బైపాస్, గొల్లపూడి మీదగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్న వైఎస్ జగన్
- రెండు రోజుల కిందటే రూట్ మ్యాప్ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ
- హఠాత్తుగా జగన్ పర్యటనపై ఆంక్షలు విధిస్తున్న పోలీసులు
- విజయవాడలోకి జగన్‌ని రానీయకుండా కుట్రలు
బెజవాడలో బ్రహ్మరథం పడతారని..
జననేత పర్యటన విజయవాడ మీదుగా సాగనున్న నేపథ్యంలో ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోంది. బెజవాడలోనూ జననేత వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని పసి గట్టిన ప్రభుత్వం.. రూట్ మ్యాప్ మార్చడం ద్వారా జనాభిమానాన్ని అడ్డుకోవచ్చుననే ఎత్తుగడకు తెరలేపిందని పరిశీలకులు చెబుతున్నారు. పరామర్శకు వెళ్తున్న వారిని మీరు ఆ రూట్‌లో వెళ్లకండి, ఈ రూట్‌లో వెళ్లండి అని పోలీసులు సూచించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే భావన వ్యక్తమవుతోంది. పోలీసులూ పెద్ద బాస్ చెప్పిందే తడవుగా, ఆయన వద్ద మార్కులు కొట్టేందుకు నోటీసులు జారీ చేశారనే చర్చ సాగుతోంది.
జనాదరణకు బెంబేలెత్తి.. జగన్ పర్యటనపై ఆంక్షల కత్తి
విజయవాడ నగరం మీదుగా రావద్దంటూ సర్కారు హూంకరింపులు
అకస్మాత్తుగా రూట్ మార్చాలంటూ పోలీసుల నోటీసులు
వైఎస్ జగన్‌కు నోటీసులు జారీ చేసిన విజయవాడ సీపీ
గుంటూరు పర్యటన జయప్రదంతో దుష్ట పన్నాగం పన్నిన ప్రభుత్వం
కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు రెండురోజుల కిందటే రూట్‌మ్యాప్ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ




