
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్‌ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.
జోగి రమేష్‌కు వైఎస్సార్‌సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్‌సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.

పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్‌సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు.