 
													సాక్షి,అమరావతి: చంద్రబాబు,నారా లోకేష్‌ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం (అక్టోబర్31) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను.చంద్రబాబు,నారా లోకేష్‌ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారు. కల్తీ మద్యం కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను. నార్కో ఆనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమే. నేను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా కుటుంబసభ్యులతో కలిసి ప్రమాణం చేశా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్ధన్ రావుకు రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రిమాండ్‌లో ఉన్న జనార్ధన్‌రావు వీడియోని ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
