
హైదరాబాద్: నకిలీ మద్యం, నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం,. ఫేక్ బాబు, ఫేక్ లోకేష్.. కట్టు కథలు, పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు.
ఈరోజు(ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
‘బాబు చేసిన కల్తీని వైఎస్సార్‌సీపీపై రుద్దే యత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవిఆర్ఎస్ కాల్స్ ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారయింది... ఎక్కడకు సరఫరా అయిందో ఎందుకు ఎంక్వరీ చేయడం లేదు.డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది. అద్దెపల్లి జనార్థన్‌కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే.
అద్దెపల్లి జనార్థన్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నంచి స్పందనలేదు. జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు. దమ్ముంటే నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా.. వస్తా. ఏపీలో మంచినీటి ుకుళాయిల కన్నా.. బెల్ట్ షాపులే ఎక్కువ. నారా వారి సారా పాలనను డోర్ డెలివరీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
