
హైదరాబాద్, సాక్షి: ఏపీ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On Chiru) తీవ్ర అలజడి రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలవడాన్ని ప్రస్తావిస్తూ.. అసెంబ్లీలో బాలయ్య అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇటు వైఎస్సార్‌సీపీ, అటు మెగా అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. ఇక ఈ పరిణామాలపై టీడీపీ ఏమో మౌనంగా ఉండిపోయింది.
చిరుపై ‘ఎవడు’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు తీవ్ర అభ్యంతరాలు(Chiru Fans Fire On Balayya) వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ గతంలోనూ చిరును ఉద్దేశించి ఈ తరహాలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు క్షమాపణలు చెప్పకపోతే ప్రజా క్షేత్రంలో నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో జనసేన స్పందించకపోవడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ కలకలం వేళ.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) హైదరాబాద్‌కు వస్తుండడం చర్చనీయామైంది. అయితే ఆయన కేవలం వైద్యం కోసమే వస్తున్నట్లు ఆయన సిబ్బంది స్పష్టం చేసింది. తీవ్ర జ్వరంతో, దగ్గుతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు చేసిన సూచన మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ సభలో లేనిది చూసి కామినేని ఈ అంశం ప్రస్తావించడం.. దానికి బాలయ్య దురుసుగా మాట్లాడడం.. ఆ టైంలో స్పీకర్ స్థానంలో ఉండి కూడా రఘురామ కృష్ణంరాజు ఉండి కూడా వారించకపోగా నవ్వుతూ చూస్తూ ఉండిపోవడం.. వీటన్నింటిని నాటకీయ పరిణామాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అప్పటికే సభలో జనసేన ఎమ్మెల్యేలు, మంత్రి ఉన్నారని, అయినా కూడా వాళ్ల నుంచి కనీస స్పందన లేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తన పెద్దన్నయ్య చిరు తనకు తండ్రితో సమానం అంటూ పవన్(Pawan About Chiru) తరచూ చెబుతూ వస్తుంటారు. తల్లిని తిట్టించారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. తర్వాత అదే టీడీపీతో పొత్తులో ఉండిపోయారు. కానీ గతంలో ఎవరైనా చిరును ఒక్క మాట అన్నా ఊరుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు బాలయ్య చిరుపై నోరు జారారు. మరి ఈ వ్యాఖ్యలపై జనసేనాని ఎలా స్పందిస్తాడో చూడాలంటూ సినీ, రాజకీయ వర్గాలు కుతుహలంగా ఎదురు చూస్తున్నాయి(Will Pawan Reacts Balayya Comments).
ఇదీ చదవండి: బాలయ్య వ్యాఖ్యలను తోసిపుచ్చిన చిరంజీవి