కక్ష కట్టారు.. కేసులకు భయపడేది లేదు: జోగి రమేష్‌ | Ex Minister Jogi Ramesh Comments On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

కక్ష కట్టారు.. కేసులకు భయపడేది లేదు: జోగి రమేష్‌

Aug 16 2024 1:29 PM | Updated on Aug 16 2024 1:44 PM

Ex Minister Jogi Ramesh Comments On Chandrababu And Lokesh

తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు.

సాక్షి, విజయవాడ: తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పీఎస్‌కు వచ్చిన జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ప్రతి పశ్నకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.

‘‘ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారు. కేసులకు భయపడేది లేదు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు’’ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement