
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్‌తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు.