
ఎన్టీఆర్ జిల్లా: అప్పుగా ఇచ్చిన డబ్బును అడిగినందుకు మాధవి అనే మహిళపై టీడీపీ గూండాలు చేసిన దాడిని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. అప్పుగా ఇచ్చిన డబ్బలను అడిగితే దాడి చేస్తారా అంటూ నిలదీశారు. టిడిపి నేతల దాడిలో గాయపడిన మాధవిని జోగి రమేష్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ కూటమిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే దాడి చేస్తారా?, మాధవి పై దాడి చేసిన టిడిపి గూండాలు వరికూటి రాము , పవన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. బాధితురాలికి న్యాయం చేయాలి. బాధితురాలికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’ అని తెలిపారు.