నృత్యోత్సవం.. నయనానందకరం
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రం కూచిపూడిలో శ్రీశ్రీ సిద్ధేంద్ర యోగి కళావేదికపై మంగళవారం సాగిన పలు కూచిపూడి నృత్యాంశాలకు కళాకా రులు చేసిన నృత్యాలు అలరించాయి. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నాట్యాచార్యులు బొక్క కుమారస్వామి స్మృత్యార్థం మంగళవారం నిర్వహించిన 51వ కూచిపూడి నాట్య పతాక ఉత్సవం కనుల పండువగా సాగింది. ఉభ య తెలుగు రాష్ట్రాల నాట్య గురువులు తమ శిష్యులతో ప్రదర్శించిన పలు నాట్యాంశాలు రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపజేశాయి. నాట్యాచార్యులు పసుమర్తి రామలింగ శాస్త్రి, వేదాంతం రాధేశ్యాం, వేదాంతం రామలింగ శాస్త్రి, దేవా లయ పాలకమండలి ఉపాధ్యక్షుడు పసుమర్తి నారాయణమూర్తి, కోశాధికారి జోశ్యుల నాగ జగన్మోహన రావు, డాక్టర్ చింతా రవి బాల కృష్ణ, డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. హంస ధ్వని కూచిపూడి నృత్యాలయ(విజయవాడ) వ్యవస్థాపకుడు సీహెచ్ అజయ్ కుమార్ శిష్య బృందం, శ్రీ స్వరలయ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (హైదరాబాద్) డైరెక్టర్ డాక్టర్ సౌజన్య రాజన్ శిష్యులు, త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ (హైదరాబాద్) వ్యవస్థాపకురాలు ఇందిరా పరాశరం శిష్య బృందం, సాయి నృత్య తరంగణి (హైదరాబాద్) కేఎన్ రాజేశ్వరి శ్రీధర్ శిష్యులు, కూచిపూడి నృత్యాలయ ఫౌండేషన్ (కెనడా) సుధా కామేశ్వరి శిష్య బృందం, పావని నరేంద్ర కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ (విజయవాడ) పావని నరేంద్ర శిష్యులు ప్రదర్శించిన అంశాలు అలరించాయి.
కనుల పండువగా 51వ కూచిపూడి
నాట్య పతాకోత్సవాలు


