చిరంజీవితో సినిమా తీయడం అదృష్టం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చిరంజీవితో సినిమా తీయడం తన అదృష్టమని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. జనవరి 12వ తేదీన విడుదల కానున్న మన శంకర వరప్రసాద్ సినిమా ప్రచారంలో భాగంగా విజయవాడ వచ్చిన ఆయన ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. చిరంజీవి ఈ చిత్రంలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను చేసిన ఎనిమిది సినిమాల్లో మూడు సంక్రాంతికి విడుదలయ్యా యని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవితో తీసిన సినిమా కూడా సంక్రాంతికే రానుండటం ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ సినిమాలో శశిరేఖ పాత్రలో నయనతార జీవించిందని, సినిమాలో చివరి 13 నిమిషాల్లో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారని వివ రించారు. చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలి పారు. మీసాల పిల్ల పాట 100 మిలియన్ల వ్యూస్, శశిరేఖ పాట 30 మిలియన్ల వ్యూస్ దాటాయన్నారు. బీమ్స్ సంగీతం అల్టిమేట్‌గా ఉందని, ఈ చిత్రంలో మ్యూజికల్ వినోదం, యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఉంటాయని చెప్పారు.
దర్శకుడు అనిల్ రావిపూడి


