రైల్వే లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయడం నిషేధం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్‌లో రైల్వే యార్డ్‌లు, ట్రాక్‌లు, సమీప ప్రాంతాల్లో గాలిపటాలను ఎగరవేయడంపై నిషేధం ఉందని దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గతంలో సంక్రాంతి సీజన్‌లో పలు రైల్వే జోన్లలో ఇలా అనేక కేసులు నమోదయ్యాని గుర్తుచేసింది. 25 కేవీ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ (ఓహెచ్‌ఈ) లైన్లలో చిక్కుకున్న గాలిపటాల దారాలను తాకిన వ్యక్తులు తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారని వెల్లడించింది. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న గాలిపటాల దారాలను లోహం లేదా రసాయనాలతో తయారు చేయడం వల్ల అవి విద్యుత్ వాహకాలుగా పని చేస్తాయని వివరించింది. ప్రతి ఒక్కరూ పండుగను బాధ్యతగా జరుపుకోవా లని, జీవిత భద్రత, నిరంతర రైలు నిర్వహణకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
నున్న(విజయవాడరూరల్): రాబోయే ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించేందుకు డీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ఆదేశించారు. నున్న జిల్లా పరిషత్ హైస్కూల్‌ను డీఈఓ చంద్రకళ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల హాజరు పత్రాలను పరిశీలించారు. అనంతరం ఇటీవల జరిగిన పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు సాధించిన మార్కులను సమీక్షించారు. పలు సబ్టెక్టుల్లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులతో సంబంధిత ఉపాధ్యాయుల సమక్షంలో డీఈఓ మాట్లాడారు. విద్యార్థుల తెలుగు భాషా ప్రావీణ్యాన్ని వ్యక్తిగతంగా అంచనా వేశారు. అనంతరం డీఈఓ చంద్రకళ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై అవసరమైన సూచనలు చేశారు. పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల హాజరు క్రమం తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. నిత్యం 30 నుంచి 50 మంది విద్యార్థులు గైర్హాజరవడంపై ప్రశ్నించారు. విద్యార్థుల హాజరు మెరుగుపర్చడానికి ఎస్‌ఎంసీ కమిటీతో ఉపాధ్యాయులు సమన్వయంతో ఉండాలన్నారు. అవసరమైతే ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు స్కూల్‌కు వచ్చేలా చూడాలన్నారు. పాఠశాల అభివృద్ధికి ఉదారంగా విరా ళాలు అందించిన దాతలు, పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ సంద ర్భంగా పాఠశాల ప్రాంగణంలో డీఈఓ చంద్రకళ మొక్కనాటారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్.రవిప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రైల్వే లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయడం నిషేధం


