
పూర్తి అహింసాయుత మార్గంలో పోరాటం చేద్దాం
లేహ్ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరిగేవరకు జైల్లోనే ఉంటా
న్యాయవాది ద్వారా లద్దాఖ్ ప్రజలకు సోనమ్ వాంగ్‌చుక్ సందేశం
లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో శాంతియుత పోరాటం కొనసాగిద్దామని లద్ధాఖ్ ప్రజలకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. గత నెల 24న లేహ్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారటంతో నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే.
ఆ ఘటనకు కారకుడిగా పేర్కొంటూ జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేసి రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్‌చుక్ సోదరుడు క సెతన్ దోర్జీ లేతో కలిసి న్యాయవాది హాజీ ముస్తఫా శనివారం జైల్లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముస్తఫా ద్వారా లద్ధాఖ్ ప్రజలకు వాంగ్‌చుక్ సందేశం పంపారు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాను. నాకోసం ప్రారి్థంచినవారందరికీ ధన్యవాదాలు.
లేహ్ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని, అరెస్టయినవారు ధైర్యంగా ఉండాలని ప్రారి్థస్తున్నాను. గత నెల 24న జరిగిన ఘర్షణపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. అలా విచారణ జరగని పక్షంలో నేను జైల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నా.
లద్దాఖ్‌కు రాష్ట్రహోదా ఇచ్చి ఆరో షెడ్యూల్ చేర్చాలన్న లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కేడీఏ)కు నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. డిమాండ్ల సాధన కోసం ప్రజలంతా శాంతియుతంగా, ఐకమత్యంతో సంపూర్ణంగా గాంధీ మార్గంలో పోరాటం చేయండి’అని వాంగ్‌చుక్ ఇచ్చిన సందేశాన్ని ముస్తఫా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. లేహ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. నిరసనకారులను సోమవారం చర్చలకు ఆహా్వనించింది. అయితే, వాంగ్‌చుక్‌తోపాటు పోలీసులు అరెస్టు చేసినవారందరినీ విడుదల చేసి, లేహ్ ఘటనపై జ్యుడీíÙయల్ విచారణకు ఆదేశించేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని ఎల్‌ఏబీ, కేడీఏ తేల్చి చెప్పాయి.