హైదరాబాద్: పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన ఓ యువతి.. తానే పోలీస్ అని తప్పుదోవ పట్టించింది. విషయం తెలియడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాపూర్‌నగర్‌కు చెందిన ఓ యువతి (22) పోలీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం రాకపోవడంతో తాను పోలీస్ అని అందరిని నమ్మించాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే యూనిఫామ్ ధరించి పలుచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా బందోబస్తు డ్యూటీ సైతం చేసింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి వద్ద కూడా 10 రోజుల బందోబస్తు డ్యూటీ చేసిందట. ఈ విషయం మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులకు తెలియడంతో వారు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ దీనిపై విచారించి..ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


