వాషింగ్టన్: అమెరికాలో మరో భారత యువతి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికింది. పైగా తాను దొంగతనం చేయలేదని బుకాయించింది. తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించడం మరిచిపోయానంటూ ప్రాధేయపడింది. కావాలంటే ఇప్పుడు తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తా. నన్ను వదిలేయండి’ అంటూ చేతులు జోడించి అక్కడి పోలీసుల్ని వేడుకుంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి టూరిస్ట్ వీసాతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో అమెరికాకు చెందిన ఓ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఓ షాప్‌లో తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. సదరు షాపు యజమాని ..తన షాపులో ఓ యువతి దొంగతనం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు వీడియోలో.. ఆ యువతి ఎలా శిక్ష విధించకుండా వదిలేయమని కోరింది. తాను షాపులు వస్తువుల్ని కొనుగోలు చేశానే తప్పా.. దొంగతనం చేయలేదని, కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని చెప్పడం ఆవీడియోలో చూడొచ్చు. కాగా, ఆ యువతి వివరాలు, ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.
👉ఇదీ చదవండి: చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?
కొద్దిరోజుల క్రితం
కొద్దిరోజుల క్రితం మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్‌లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ అని కోరినప్పటికీ పోలీసులు ఆమెను కటకటాల వెనక్కు పంపారు.


