
ఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం లద్దాఖ్‌లో జరిగిన అల్లర్లకు కారణం వాంగ్‌చుక్‌గా కారణంగా భావిస్తూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హింసను రెచ్చగొట్టినట్టు వాంగ్‌చుక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాంగ్‌చుక్ ఎన్‌జీవో లైసెన్స్‌ను సైతం కేంద్రం రద్దు చేసింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఆయన స్థాపించినస్వచ్ఛంద సంస్థ( SECMOL)కు విదేశీ నిధులు స్వీకరించే హక్కును కూడా రద్దు చేసింది. అరెస్టుకు ముందు వాంగ్‌చుక్ వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉద్యమం కోసం అరెస్టయితే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. లద్దాఖ్ రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించించిన సంగతి తెలిసిందే. దీంతో వాంగ్‌చుక్.. తాను చేపట్టిన రెండు వారాల దీక్షను కూడా ఆయన ముగించిన సంగతి తెలిసిందే.
లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో జనం బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్‌పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు.
ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు.