సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు ఎన్‌టీవీ రిపోర్టర్లు అరెస్ట్ ఘటన తీవ్ర దుమారం లేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. ఒక వార్త విషయంలో విచారించాలంటూ మంగళవారం రాత్రి ఎన్టీవీ రిపోర్టర్లను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను పోలీసులు తీసుకెళ్లారు. ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న జర్నలిస్టును కూడా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్ట్‌పై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికీ ముగ్గురు ఎన్‌టీవీ రిపోర్టర్లు పోలీసుల అదుపులోనే ఉండటం గమనార్హం.



