గ్యాంగ్‌ రేప్‌ కేసు.. స్నేహితుడి పనే?! అరెస్ట్‌ | New Twist In West Bengal Durgapur Case | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌ రేప్‌ కేసు.. స్నేహితుడి పనే?! అరెస్ట్‌

Oct 15 2025 6:46 AM | Updated on Oct 15 2025 6:46 AM

New Twist In West Bengal Durgapur Case

తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్‌ గ్యాంగ్‌రేప్‌ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్‌రేప్‌ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్‌ సఫీఖుల్, షేక్‌ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్‌ షేక్, షేక్‌ రియాజుద్దీన్‌లను అరెస్ట్‌చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్‌ చేశారు. 

దుర్గాపూర్‌/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్‌ గ్యాంగ్‌రేప్‌ ఉదంతం(Durgapur Gang Rape Case) కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్‌రేప్‌ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్‌ సఫీఖుల్, షేక్‌ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్‌ షేక్, షేక్‌ రియాజుద్దీన్‌లను అరెస్ట్‌చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్‌చేశారు. ఘటన జరిగిన తీరుపై బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలానికి, స్నేహితుడు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని మంగళవారం సాయంత్రం బెంగాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. 

బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని(No Gang Rape), క్లాస్‌మేట్‌ అయిన ఈ స్నేహితుడు మాత్రమే రేప్‌ చేశాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని పోలీసులు చెప్పారు. నిందితులందరి దుస్తులు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించామని నివేదిక వచ్చాకే కేసులో స్పష్టత వస్తుందని అసన్‌సోల్‌–దుర్గాపూర్‌ పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ చౌద్రీ చెప్పారు. చౌద్రీ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజు గంటన్నర ఆలస్యంగా తమ కూతురి స్నేహితుడు తమకు సమాచారం ఇచ్చాడని, అతనిపైనా తమకు అనుమానం ఉందని బాధితు రాలి తండ్రి అక్టోబర్‌ 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చివరకు ఆ స్నేహితుడు సైతం అరెస్ట్‌కావడం గమనార్హం. 

దుర్గాపూర్‌ పట్ణణ శివారులోని ప్రైవేట్‌ ఎంబీబీఎస్‌ కళాశాల హాస్టల్‌ నుంచి దూరంగా ఉన్న ధాబాలో భోజనం చేసేందుకు ఈ స్నేహితుడే బాధితురాలిని బయటకు తీసుకెళ్లగా గ్యాంగ్‌రేప్‌ జరిగిందని కేసు నమోద వడం తెల్సిందే. డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ గుప్తా సారథ్యంలోని బృందం సీన్‌ రీక్రియేషన్‌ కోసం ఐదుగురు నిందితులను మంగళవారం మధ్యాహ్నం ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రశ్నించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రించారు. 

ఈ సందర్భంగా ఐదుగురు నిందితులు విడివిడిగా చెప్పిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దీనికితోడు బాధితురాలు ముగ్గురిలో కేవలం ఒక్కరే రేప్‌ చేశారని తొలుత వాంగ్మూలం ఇవ్వడం, తర్వాత ఐదుగురు రేప్‌ చేశారని మరోలా వాంగ్మూలం ఇవ్వడం, స్నేహితుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో ఆ స్నేహితుడిని అరెస్ట్‌చేశామని కమిషనర్‌ చెప్పారు. ‘‘బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలు, లభించిన ఆధారాలు, నిందితుల స్టేట్‌మెంట్లను గమనిస్తే ఇది గ్యాంగ్‌రేప్‌ కాదని అర్థమవుతోంది. ఒక్కరు మాత్రమే అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది’’ అని కమిషనర్‌ వ్యాఖ్యానించారు.

వాంగ్మూలాలకు, సీసీటీవీ ఫుటేజీకి కుదరని లంకె
నిందితులు, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలా లకు, సీసీటీవీలో ఉన్న దృశ్యాలకు సైతం పొంతన కుదరకపోవడం ఈ కేసులో సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు స్నేహితుడు పారిపో యాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. కానీ బాధితురాలు, స్నేహితుడు అసలేం జరగనట్లు, ముఖాల్లో ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా హాస్టల్‌కు తిరిగొచ్చినట్లు ఘటన తర్వాత హాస్టల్‌ గేటు దగ్గరి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. 

రేప్‌ వేళ పెనుగులాటలో బాధితురాలి దుస్తులు చిరిగిపోవడమో, జుట్టు చిందరవందరగా ఉండటమో లాంటివి లేకుండా బాధితురాలు ఆ వీడియోలో మా మూలుగానే కనిపించింది. తనకు హాని జరిగిందని బాధితురాలు హాస్టల్‌ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదుచేసినట్లు ఫుటేజీలో కనిపించలేదు. వాళ్ల సాయం కోరిన ట్లుగా కూడా లేదు. ‘‘ఘటన తర్వాత బాధితు రాలి ఫోన్‌ నుంచి స్నేహితునికి ఆగంతకులు ఫోన్‌ చేసి రమ్మన్నారు. ఫోన్‌ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్‌చేశారు. ఆమె వద్ద ఉన్న రూ. 200 లాగేసుకున్నారు’’ అని కమిషనర్‌ వెల్లడించారు.  

ఇదీ చదవండి: బస్సులో.. క్షణాల్లోనే కాలి బుగ్గైన 20 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement