తలుపులు మూసి.. ప్రేమ జంటను దాచి..! | Newly Weds Love Birds Protect By Nuzividu Police | Sakshi
Sakshi News home page

తలుపులు మూసి.. ప్రేమ జంటను దాచి..!

Nov 29 2025 6:30 PM | Updated on Nov 29 2025 6:51 PM

Newly Weds Love Birds Protect By Nuzividu Police

సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద శనివారం సినీ ఫక్కీలో హైడ్రామా నడిచింది. వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించగా.. యువతి బంధువులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఆ జంటను కాపాడేందుకు పోలీసులు శాయశక్తుల కృషి చేశారు. 

స్థానికంగా బాపునగర్‌కు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. ఆపై ప్రాణ రక్షణ కోరుతూ నూజివీడు పోలీసులను ఆశ్రయించారు. ఈ సమాచారం అందుకున్న యువతి తరపు బంధువులు.. 

పీఎస్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. పట్టరాని కోపంతో పోలీసులు పక్కకు నెట్టేసి ఆ జంటపై దాడికి దిగారు. యువకుడిని చితకబాదుతుండడంతో పోలీసులు బంధువుల్ని అదుపు చేసి ఆ జంటను లోపలికి తీసుకెళ్లారు. స్టేషన్‌ తలుపులు, గేట్లు మూసేసి వాళ్లను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే.. గేట్లు ధ్వంసం చేసుకుని మరీ పీఎస్‌లోకి చొరబడేందుకు యువతి బంధువులు ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement