సాక్షి, కోనసీమ జిల్లా: ఐ.పోలవరంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన జనసేన నాయకుడు సత్య వెంకట కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా పరారీ లో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై నిందితుడు ఆరు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికతో పాటు మరికొందరిపై కూడా నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
బాలిక తల్లి తప్ప.. ఫిర్యాదు చేయడానికి మిగిలిన బాధితులు ముందుకు రావడం లేదు. అత్యాచార ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని.. మోటారు సైకిళ్ల దొంగతనం, దొంగ నోట్ల మార్పిడి కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో సత్య కృష్ణపై సస్పెక్ట్ షీట్ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐ.పోలవరం హైస్కూల్లో విద్యా కమిటీ కో-ఆప్షన్ సభ్యుడిగా కొనసాగుతున్న సత్య కృష్ణ.. దుర్మార్గానికి ఒడికట్టాడు. నేరం రుజువైతే నిందితుడికి జీవిత ఖైదు పడుతుందని డీఎస్పీ తెలిపారు.


