నలుగురు నిందితుల అరెస్టు
కొప్పళ జిల్లాలో ఘటన వెలుగులోకి
సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: ఓ మహిళకు జ్యూస్ తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకా మడ్లూరు గ్రామానికి చెందిన మహిళ (39)ను బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నమ్మించి, మాయ మాటలు చెప్పి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి జ్యూస్ తాగించారు. ఆమెపై నలుగురు అత్యాచారం చేయడంతో బాధితురాలు యలబుర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అత్యాచారానికి పాల్పడిన లక్ష్మణ కెంచప్ప, బసవరాజ్ సక్రప్ప, భీమప్ప, శశికుమార్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు.
ఆదివారం సాయంత్రం హొసపేటె నుంచి కొప్పళకు బకాయి డబ్బులిస్తామని చెప్పిన యువకుడి మాటలు నమ్మి బాధిత మహిళ వచ్చింది. ఆమె తనకు పరిచయం ఉన్న లక్ష్మణ్‌కు అప్పు ఇచ్చింది. దానిని పొందడానికి ఆ మహిళను కుష్టిగికి పిలిపించారు. లక్ష్మణ్, మరో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంలో ఆమెను యలబుర్గా తాలూకా మడ్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ జ్యూస్‌లో మత్తు మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కొప్పళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


