సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన అంబోజి వినయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు వినయ్‌పై కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అంబోజి వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వినయ్‌పై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుతో హైదరాబాద్‌లో ఉన్న వినయ్‌ను ఆదివారం తెల్లవారుజామున ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వినయ్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు. వినయ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


