తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తున్న ఓ నటి.. నెలలుగా ఇబ్బంది పడుతోంది. ఇక తట్టుకోలేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ఈ నటిని వేధిస్తున్న వ్యక్తిని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి)
ఏం జరిగింది?
స్వతహాగా బెంగళూరుకి చెందిన ఓ నటి.. కన్నడతోపాటు తెలుగులోనూ సీరియల్స్ చేస్తోంది. ఈమెకు ఓ రోజు నవీన్ అనే వ్యక్తి నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కానీ ఈమె దీన్ని తిరస్కరించింది. పలుమార్లు ఇలానే చేసింది. దీంతో కక్ష పెంచుకున్న ఇతడు.. అభ్యంతరకర వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. బ్లాక్ చేయడంతో పలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి మరీ సదరు నటికి మెసేజులు, వీడియోలు పంపిస్తూనే ఉన్నాడు.
దాదాపు మూడు నెలల పాటు నవీన్ వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు నటి.. ఇక తట్టుకోలేక వ్యక్తిగతంగా అతడిని కలిసి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే నాగభైరవి ప్రాంతంలోని నందన్ ప్యాలెస్‌లో నవీన్‌ని కలిసింది. ఇవన్నీ ఆపేయాలని కోరింది. అయినా సరే అతడిలో మార్పు రాకపోవడంతో పోలీసులని ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదు మేరకు నవీన్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది.
(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
