ఎట్టకేలకు తేరుకుంటున్న రూపాయి | Rupee rallies sharply to rise above 67/dollar levels | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు తేరుకుంటున్న రూపాయి

Aug 29 2013 9:42 AM | Updated on Nov 9 2018 5:30 PM

భారీగా పతనం అయిన రూపాయి ఎట్టకేలకు తేరుకుంటోంది. ప్రారంభంలో రూపీ రెండు రూపాయిలతో ప్రారంభమైంది.

ముంబయి : భారీగా పతనం అయిన రూపాయి ఎట్టకేలకు తేరుకుంటోంది. ప్రారంభంలో రూపీ రెండు రూపాయిలతో ప్రారంభమైంది. 154 పైసలు లాభపడింది. అలాగే దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 170 పాయింట్లతో, నిఫ్టీ 40 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.67.20 పైసలుగా ఉంది.

మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు  ఈవాళ మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఓ మాదిరిగా లాభపడ్డాయి. యూరోప్‌ మార్కెట్లు 1 శాతం దాకా నష్టపోయాయి. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు కూడా చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. ఒక్క షాంఘై సూచీ మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది.  సింగపూర్‌ నిఫ్టీ 40 పాయింట్ల దాకా లాభపడుతూ 5,300లకు సమీపంలో ట్రేడవుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement