హైదరాబాద్ : అదేం విచిత్రమో గానీ.. నగరంలో వాతావరణం బహు గమ్మత్తుగా మారుతోంది. బుధవారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వర్షపు చిత్రం.. భళారే విచిత్రాన్ని తలపించింది.
ఆకాశంలో కారుమబ్బులు ఒక్కసారి కమ్ముకుని హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వైపు ట్యాంక్‌బండ్ ఫుట్‌పాత్‌పై వానజల్లు కురవగా.. దీనిని ఆనుకునే ఉన్న ఇటువైపు రహదారిపై మాత్రం ఒక్క చుక్క చినుకు రాలకపోవడం వింతగా తోచింది.
ఇదేం కాలమోనంటూ బాటసారులు ఆశ్చర్యచకితులయ్యారు! గీత గీసి మరీ వాన కొట్టినట్టుగా అనిపించింది.
– సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్


