ఈ–కోర్టులకు రూ.1,200 కోట్లు
దేశవ్యాప్తంగా ఉన్న కింది స్థాయి కోర్టులను (సబార్డినేట్ కోర్టులు) డిజిటలైజ్ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈ–కోర్ట్స్ ప్రాజెక్ట్ – ఫేజ్ 3’ కోసం 2026–27 కేంద్ర బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్ అంచనాల్లో రూ.1,500 కోట్లు ప్రతిపాదించగా, తుది కేటాయింపుల్లో రూ.1,200 కోట్లు ఖరారు చేశారు.
సబార్డినేట్ కోర్టుల కంప్యూటరీకరణ
దేశంలోని అన్ని సబార్డినేట్ కోర్టులను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించి, సాంకేతికతను అనుసంధానం చేయడం ఈ విడత ప్రధానోద్దేశం. 2023 సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్ ఈ మూడో దశను ఆమోదించింది. నాలుగేళ్ల కాలపరిమితిలో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు మొత్తం బడ్జెట్ అంచనా రూ.7,210 కోట్లు. దీనిని కేంద్ర రంగ పథకంగా అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!


