బడ్జెట్ 2026: వికసిత్‌ భారత్ దిశగా అడుగులు! | Budget 2026-27 Viksit Bharat Middleclass Hopes, Aims To Boost Income, Jobs, Infrastructure And Rural Development | Sakshi
Sakshi News home page

Budget 2026: వికసిత్‌ భారత్ దిశగా అడుగులు!

Jan 30 2026 10:20 AM | Updated on Jan 30 2026 10:58 AM

budget2026-viksitbharat-middleclass-hopes

భారత జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతున్న వేళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2025-26లోని వివరాల ప్రకారం.. ఈసారి బడ్జెట్ కేవలం అంకెలు మాత్రమే కాదు, సామాన్యుడి ఆశల ప్రతిరూపంగా ఉండనుందనే అంచనాలున్నాయి.

వేతన జీవులకు..

కేంద్ర బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు అనేది వేతన జీవులకు అత్యంత కీలకమైన అంశంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే తగ్గింపు. అంటే, మొత్తం వార్షిక ఆదాయం నుంచి ఎటువంటి ఖర్చులు చూపించాల్సిన అవసరం లేకుండానే ఈ మొత్తాన్ని నేరుగా మినహాయించుకోవచ్చు.

పెంపు ఎందుకు అవసరం?

గత కొన్ని ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న రూ.75,000 (గత సవరణల ప్రకారం) స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుత జీవన వ్యయానికి సరిపోవడం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగుల చేతిలో ఖర్చు చేయడానికి మరింత నగదు మిగులుతుంది. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే మార్కెట్‌లో వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచి జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది.

మౌలిక సదుపాయాలకు బూస్ట్

దేశాభివృద్ధికి మౌలిక వసతులే కీలకమని నమ్ముతున్న కేంద్రం ఈసారి మూలధన వ్యయం (Capital Expenditure) కేటాయింపుల్లో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గడువును పెంచడం ద్వారా స్థానికంగా రోడ్లు, బ్రిడ్జిల వంటివాటి నిర్మాణం వేగవంతం అవుతుంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (PLI) మరింత విస్తరించనున్నారు.

యువత - ఉపాధి

రాబోయే రోజుల్లో లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగ వేటలో పడనున్నారు. దీన్ని ఆర్థికంగా అందిపుచ్చుకోవడానికి బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రధానంగా జౌళి (Textiles), పర్యాటకం, ఈ-కామర్స్ రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీలు ఉండొచ్చు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వృత్తి విద్యా కోర్సులు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఎంఎస్‌ఎంఈ

చిన్న తరహా పరిశ్రమల ఆర్థిక ఇబ్బందులను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంఎస్‌ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని మరింత సరళతరం చేస్తూ కొలేటరల్(పూచీకత్తు) లేకుండా రుణాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా వస్తువులను ప్రపంచ మార్కెట్లకు చేర్చడానికి ఎగుమతి సుంకాల్లో సడలింపులు ఉండవచ్చు.

వ్యవసాయం, గ్రామీణ వికాసం

  • వాతావరణ మార్పుల ధాటికి తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రస్తుత తక్షణ అవసరం.

  • రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని(‍ప్రస్తుతం ఏటా రూ.6000) పెంచాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

  • భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ల వినియోగం, ఆధునిక గోదాముల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది.

  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ‘అందరికీ ఇల్లు’ లక్ష్యాన్ని చేరుకోవడానికి గృహ నిర్మాణ రంగానికి అదనపు కేటాయింపులు చేయనున్నారు.

ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement