పటిష్టంగానే పారిశ్రామికరంగం | December 2025 India Index of Industrial Production Highlights | Sakshi
Sakshi News home page

పటిష్టంగానే పారిశ్రామికరంగం

Jan 29 2026 9:12 AM | Updated on Jan 29 2026 10:40 AM

December 2025 India Index of Industrial Production Highlights

దేశ పారిశ్రామిక రంగం డిసెంబర్‌లో బలమైన పనితీరు చూపించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) రెండేళ్ల గరిష్ట స్థాయిలో 7.8 శాతం వృద్ధి చెందింది. మైనింగ్, తయారీ, విద్యుదుత్పత్తి రంగాలు రాణించడం ఇందుకు దారితీసింది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసింది. 2024 డిసెంబర్‌ నెలలో ఐఐపీ వృద్ధి 3.7 శాతంగా ఉండడం గమనార్హం. 

‘‘పారిశ్రామిక పనితీరు 2025 డిసెంబర్‌లో మరింత బలపడింది. ఐఐపీ వృద్ధి 7.8 శాతంతో రెండేళ్లలోనే గరిష్ట స్థాయికి చేరింది. 2025 నవంబర్‌లో నమోదైన 7.2 శాతం తర్వాత అధిక వృద్ధిని నమోదు చేసింది’’అని ఎన్‌ఎస్‌వో తెలిపింది. వాస్తవానికి 2025 నవంబర్‌ నెలకు ఐఐపీ వృద్ధిని లోగడ 6.7 శాతంగా అంచనా వేయగా, తాజాగా దీన్ని 7.2 శాతానికి సవరించింది.

  • తయారీ రంగంలో వృద్ధి 2025 డిసెంబర్‌లో 8.1 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఈ రంగం వృద్ధి 3.7 శాతంగా ఉంది.  

  • మైనింగ్‌ రంగంలో ఉత్పత్తి 6.8 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇదే నెలలో వృద్ధి 2.7 శాతంగా ఉంది.

  • విద్యుదుత్పత్తి 6.3 శాతం వృద్ధి చెందింది. 2024 డిసెంబర్‌లోనూ ఈ రంగంలో ఉత్పత్తి 6.2 శాతం పెరగడం గమనించొచ్చు.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు పారిశ్రామికోత్పత్తి 3.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 4.1 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.

ఇదీ చదవండి: లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement