పరిశ్రమలు.. నేల చూపు! | India Index of industrial production records growth of 1. 2percent in May 2025 | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు.. నేల చూపు!

Jul 1 2025 5:21 AM | Updated on Jul 1 2025 5:21 AM

India Index of industrial production records growth of 1. 2percent in May 2025

9 నెలల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి 

మే నెలలో 1.2 శాతం వృద్ధి 

మైనింగ్, విద్యుత్‌లో మైనస్‌ పనితీరు  

న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి మే నెలలో 1.2 శాతానికి పరిమితమైంది. 2024 ఆగస్ట్‌ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ముందస్తు వర్షాల రాకతో తయారీ, మైనింగ్, విద్యుత్‌ రంగాల్లో పనితీరు నిదానించడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ప్రకటించింది. 2024 మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 6.3 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఐఐపీ వృద్ధి రేటు 2.7 శాతంగా కాగా, దీన్ని 2.6 శాతానికి 
ఎన్‌ఎస్‌వో సవరించింది.   

→ తయారీ రంగంలో వృద్ధి మే నెల 2.6%కి పరిమితమైంది. గతేడాది ఇదే నెలలో వృద్ధి 5.1%. 
→ మైనింగ్‌ రంగంలో ఉత్పత్తి మైనస్‌ 0.1 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ రంగంలో వృద్ధి 6.6 శాతంగా ఉంది. 
→ విద్యుత్‌ రంగంలో ఉత్పత్తి మైనస్‌ 5.8 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 13.7 శాతం వృద్ధి నమోదైంది.  
→ క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. 14.1 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది మే నెలలో వృద్ధి కేవలం 
2.6 శాతంగానే ఉంది.  
→ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగంలో పనితీరు మైనస్‌ 0.7 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో  12.6 శాతం వృద్ధిని చూసింది.  
→ కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ రంగంలోనూ ఉత్పత్తి మైనస్‌ 2.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 7.6 శాతం వృద్ధి 
కనిపించింది.  
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) పారిశ్రామికోత్పత్తి వృద్ధి 1.8 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 5.7 శాతంగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement