
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఓనర్స్‌లో ఏ నలుగురికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో టెనెంట్స్ చెప్పాలన్నాడు. దీంతో సెలబ్రిటీలందరూ చర్చించుకుని ప్రియ, శ్రీజ, హరీశ్, పవన్ కల్యాణ్‌లను పక్కన పెట్టేశారు. భరణి, డిమాన్ పవన్, మర్యాద మనీష్‌లను కెప్టెన్సీ కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. రేసులో లేకుండా పోయిన కామనర్లు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. మీరు కావాలనే చేశారు, ఫేవరిటిజం చూపించారంటూ నోరేసుకుని పడిపోయారు. వీళ్ల ఓవరాక్షన్ వల్ల వారికే చేటు రానుంది. ఈ వారం కామనర్స్‌లో ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.

నామినేషన్స్‌లో ఏడుగురు
ఈ వారం మనీష్, హరీశ్, సుమన్ శెట్టి, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, భరణి నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా భరణి, సుమన్ శెట్టి (Suman Shetty)కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. హరీశ్, ఫ్లోరా సైనీకి పర్వాలేదనిపించేలా ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరాకు ఓట్లు పడటానికి బలమైన కారణమే ఉంది. కామనర్స్ ఓవరాక్షన్‌తో ప్రేక్షకుల తల బొప్పి కడుతోంది. దీంతో వారిలో ఒకరిని పంపిస్తే కానీ వీళ్ల నోటికి తాళం పడేలా లేదని జనం ఫీలవుతున్నారు. అందుకే కామనర్స్‌లో ఒకరిని ఎలిమినేట్ చేయాలన్న కసితో ఫ్లోరాకు ఓట్లేసి మరీ ఆమెను సేవ్ చేస్తున్నారు.
డేంజర్ జోన్‌లో ముగ్గురు
దీంతో మనీష్, ప్రియ, డిమాన్ పవన్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. డిమాన్ పవన్.. తన గేమ్ కన్నా రీతూ చుట్టూ తిరగడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ప్రియ.. తను చెప్పిందే రైట్ అంటూ వాగుతూనే ఉంటుంది. మనీష్.. వరస్ట్ కామనర్స్ అంటూ తన టీమ్‌నే తిడతాడు, మళ్లీ వాళ్లనే సపోర్ట్ చేస్తాడు. ఒక మాట మీద నిలబడడు. అందుకే వీళ్లలో ఒకర్ని బయటకు పంపించాలన్నది బుల్లితెర ప్రేక్షకుల ఆలోచన. ముఖ్యంగా మనీష్, పవన్‌లపైనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి!
చదవండి: ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..!