ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..! | Bigg Boss Telugu 9: Captaincy Task Heats Up Between Owners & Tenants | Sakshi
Sakshi News home page

Bigg Boss Promo: హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌.. ఈ ఫోన్ గోల ఏంట్రా బాబు!

Sep 18 2025 1:05 PM | Updated on Sep 18 2025 1:19 PM

Bigg Boss Telugu Season 9 latest Promo Out Now

బిగ్‌బాస్‌ రెండో వారం మరింత హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్స్‌ ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. తీరా చూస్తే ఈ వారంలో భరణి, హరీశ్‌, మనీష్‌, ప్రియ, డిమాన్‌ పవన్‌, ఫ్లోరా, సుమన్‌ శెట్టి నామినేట్ అయ్యారు. తాజాగా ఇవాళ బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో కెప్టెన్సీ కోసం కంటెెస్టెంట్స్‌ ఎలా పోటీ పడ్డారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. 

(ఇది చదవండి: 4 రోజులుగా మాస్క్‌ మ్యాన్‌ నిరాహార దీక్ష! నామినేషన్స్‌లో ఏడుగురు)

ప్రస్తుతం నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్‌లో కెప్టెన్సీ గోల మొదలైంది. ఇందులో భాగంగా ఓనర్స్, టెనెంట్స్ మధ్య బజర్‌ నొక్కే టాస్క్‌ పెట్టాడు బిగ్‌బాస్‌.  టాస్క్‌లో భాగంగా  ఈ రెండు గ్రూపుల మధ్య ఫోన్‌ కాల్స్‌.. మేమంటే మేము అంటూ బజర్‌ నొక్కలేదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరి చివరికీ కెప్టెన్సీ ఏ గ్రూప్‌కు దక్కిందన్నది తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. తాజాగా ఇవాళ రిలీజైన ప్రోమో చూస్తే కెప్టెన్సీ కోసం రెండు గ్రూపుల మధ్య పోటీ గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement