
నువ్వు అనుకుంటే అయిపోద్ది సామీ! అన్నది సినిమా డైలాగ్.. అయితే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)లోనూ రీతూ బలంగా కోరుకుంటే అది జరిగి తీరాల్సిందే! డిమాన్ పవన్ కెప్టెన్ అవాలని ఆశపడింది. తాను సగం చాక్లెట్ తిని.. ఎంగిలి చేసిన చాక్లెట్‌ను పవన్‌కు ఇస్తూ నువ్వే కెప్టెన్ అవాలి అని కళ్లతోనే ఆర్డరేసింది. తీరా సంచాలక్ పదవి తన చేతికే రావడంతో పవన్‌ను కెప్టెన్ చేసేసింది.
మళ్లీ కెప్టెన్ అయిన పవన్
కానీ నాగార్జున ఈ వ్యవహారాన్నంతా వీడియో వేసి మరీ చూపించాడు. సంచాలక్‌గా రీతూ.. భరణిని అవుట్ చేయడం తప్పని చెప్పాడు. పవన్‌ను కావాలనే గెలిపించిందన్నాడు. దీంతో పవన్.. నిజాయితీగా కెప్టెన్సీ గెలుస్తాను, ఇది నాకొద్దంటూ కెప్టెన్సీ బ్యాడ్జ్ తిరిగిచ్చేశాడు. దీంతో హౌస్‌లో మరోసారి కంటెండర్లు భరణి, మనీష్, ఇమ్మాన్యుయేల్, పవన్ మధ్య గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ గెలిచి మళ్లీ కెప్టెన్సీ సాధించాడని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ పవన్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌తో కనిపించాడు.
చదవండి: నాగార్జుననే ఎదిరించిన శ్రీజ, ప్రియ.. ఉతికారేసిన హోస్ట్