వైల్డ్‌కార్డ్స్‌గా రీతూ-పవన్‌.. నయని విమర్శలు | Bigg Boss 9 Telugu Fame Demon Pavan, Rithu Chowdary Wildcards in BB Jodi 2 | Sakshi
Sakshi News home page

రీతూ-పవన్‌ రొమాంటిక్‌ సాంగ్‌.. నయని పావని విసుర్లు

Jan 14 2026 1:29 PM | Updated on Jan 14 2026 1:41 PM

Bigg Boss 9 Telugu Fame Demon Pavan, Rithu Chowdary Wildcards in BB Jodi 2

బిగ్‌బాస్‌ షోలో ఎక్కడెక్కడినుంచో కంటెస్టెంట్లు వచ్చి పాల్గొంటారు. హౌస్‌లో ఫ్రెండ్స్‌ అవుతారు, శత్రువులవుతారు, అమ్మ, అక్క, నాన్న, అన్న అంటూ వరుసలు కూడా కలుపుకుంటారు. ఈ స్నేహాలు, ప్రేమలు, బంధుత్వాలు కొందరు హౌస్‌లోనే ఆపేస్తే మరికొందరు మాత్రం ఆ ఆప్యాయతలను బయట కూడా కొనసాగిస్తారు.

బిగ్‌బాస్‌లో పవన్‌- రీతూ ట్రాక్‌
బిగ్‌బాస్‌ జోడీ డిమాన్‌ పవన్‌ - రీతూ చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు. తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో పాల్గొన్న వీరిద్దరూ హౌస్‌లో చాలా క్లోజ్‌ అయ్యారు. వీరి లవ్‌ట్రాక్‌ జనాలకు ఎంతగానో నచ్చింది. రీతూ ఎలిమినేట్‌ అయినప్పుడు కూడా ఈ జంట విడిపోయిందని అభిమానులు తెగ బాధపడ్డారు.

వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్స్‌గా ..
అలాంటివారికోసం పవన్‌- రీతూ మరోసారి జంటగా కనువిందు చేసేందుకు రెడీ అయ్యారు. వీరిద్దరూ జతగా బీబీ జోడీ సీజన్‌ 2లో వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరాగానే రొమాంటిక్‌ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జంట డ్యాన్స్‌, కెమిస్ట్రీ చూసి జడ్జిలు చప్పట్లు కొట్టారు. 

నయనికి రీతూ కౌంటర్‌
కానీ బీబీ జోడీలోని మరో కంటెస్టెంట్‌ నయని పావని  మాత్రం.. కాస్త డ్యాన్స్‌ తక్కువైనట్లు అనిపించిందంటూ విమర్శించింది. దబదబ స్టెప్పులేసేందుకు ఇది మాస్‌ సాంగ్‌ కాదుగా అని రీతూ కౌంటరివ్వగా దబదబ కొట్టమనట్లేదు, కానీ స్టెప్పులేయాలని చెప్తున్నా అని నయని సీరియస్‌గా ఆన్సరిచ్చింది. ఏదేమైనా ఈ జోడీ రాకతో ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ ఖుషీ!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement