ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దారులు అన్నీ దుర్గమ్మ సన్నిధికే చేరాయి.. జ్యోతి కాంతులు జగజ్జననికి నీరాజనాలు పట్టాయి. భక్తుల శరణుఘోషతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పులకించాయి
కళాకారుల విన్యాసాలు అమ్మకు కళాజ్యోతులర్పించాయి
కనకదుర్గమ్మకు నిర్వహించిన జ్యోతుల ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది
మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భవానీలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జ్యోతులను సమర్పించారు


