
ఇంద్రకీలాద్రి : శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి

విద్యుత్ దీపకాంతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలిగిపోతుండగా, పగటి వేళ అమ్మవారి నామస్మరణ, భక్తులు, భవానీల రాకపోకలతో ఇంద్రకీలాద్రి పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తోంది

దీక్షలను విరమించేందుకు ఆదివారం పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు

భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద కొబ్బరి కాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు

దీక్షవిరమణలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీల రద్దీపై జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దృష్టి సారించారు

బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రద్దీని అంచనా వేశారు



















































