
విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాల తొలి రోజైన సోమవారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాల నిర్వహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
























