అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

CM YS Jagan Offers Pattu Vastralu To Goddess Kanaka Durga - Sakshi

సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు.

కొండమీదకు చేరుకున్న సీఎం జగన్‌ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.  అనంతరం వస్త్రధారణ పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు పార్థ సారధి, వల్లభనేని వంశీ,అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు 
దుర్గగుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. లడ్డూ పోటు, ఘాట్‌రోడ్‌ అభివృద్ధి, సోలార్‌ సిస్టమ్‌తో పాటు అభివృద్ధి పనులకు సీఎం నిధులు ప్రకలించారని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top