బాబుదే కల్తీ పాపం.. ఇవిగో ఆధారాలు | YS Jagan fires on Chandrababu naidu adulterated ghee drama | Sakshi
Sakshi News home page

బాబుదే కల్తీ పాపం.. ఇవిగో ఆధారాలు

Feb 20 2026 5:19 AM | Updated on Feb 20 2026 5:28 AM

YS Jagan fires on Chandrababu naidu adulterated ghee drama

నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్‌ కావడం, వాటినే తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే.. 

అయినా వైఎస్సార్‌సీపీపై బురద జల్లడం ఏంటి?

చంద్రబాబు కల్తీ నెయ్యి నాటకాన్ని ఉతికి ఆరేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

రూ.200–300లకు కిలో నెయ్యి వస్తుందా అంటూ విష ప్రచారం చేసి ఎవ్వరినీ టెండర్లలో పాల్గొనకుండా బాబు భయపెట్టాడు 

ఆ తర్వాత హెరిటేజ్‌ అనుబంధ సంస్థలతో రెట్టింపు రేట్లతో టెండర్లు వేయిస్తున్నాడు 

ఇందాపూర్‌ డెయిరీ హెరిటేజ్‌కు మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ కాదా?.. 

ఇదే విషయాన్ని హెరిటేజ్‌ తన అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది 

దీనిపై దుమారం రేగడంతో వెబ్‌సైట్‌లో ఎడిట్‌ చేసి  కో–మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ అంటూ మార్చేసింది 

2014–19 మధ్య ఇందాపూర్‌ టీటీడీకి కిలో రూ.278కి నెయ్యి సరఫరా చేసింది 

ఇప్పుడు ఏకంగా టెండర్లలో మళ్లీ కిలో నెయ్యి రూ.658కి కోట్‌ చేసింది 

ఏఆర్‌ డెయిరీ 2024 జూన్, జూలైలో 8 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది 

2024, జూలై 6, 12న వచ్చి న 4 ట్యాంకర్లను టీటీడీ రిజెక్టు చేసి వెనక్కి పంపిస్తే.. వాటిని ఆగస్టు–సెప్టెంబర్   లో మళ్లీ టీటీడీలోకి తీసుకొచ్చి వినియోగించారు 

ఇది సాక్షాత్తూ సీబీఐ–సిట్‌ చార్జిషీట్‌లో పేర్కొంది 

బాబు భగవంతుడితో ఆటలాడాలని చూశాడు.. ఆ దేవుడే మొట్టికాయలు వేశాడు 

ఈ సాక్ష్యాలన్నీ చూసి ప్రజలే చంద్రబాబు నిజస్వరూపాన్ని నిర్ధారించాలని జగన్‌ విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: టెండర్ల ఖరారు.. నెయ్యి సరఫరా.. ట్యాంకర్లు రిజెక్ట్‌ కావడం.. తిరస్కరించిన ట్యాంకర్లు మళ్లీ టీటీడీలోకి రావడం... ఆ ట్యాంకర్లలో నెయ్యిని వినియోగించడం.. అన్నీ జరిగింది చంద్రబాబు సర్కార్‌ హయాంలో.. వాటితో వైఎస్సార్‌సీపీకి ఏం సంబంధం అంటూ సీఎం చంద్రబాబును, కూటమి సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శాసనమండలిలో ఇందాపూర్‌ హెరిటేజ్‌ డెయిరీపై చర్చ జరిగితే.. వైఎస్సార్‌సీపీ సాక్ష్యాధారాలతో చంద్రబాబు బాగోతాన్ని బట్టబయలు చేస్తుందన్న భయంతోనే చర్చ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ఇందాపూర్, బోలేబాబా డెయిరీలతో హెరిటేజ్‌ బంధానికి సంబంధించిన సాక్ష్యాలను, కల్తీనెయ్యి చంద్రబాబు హయాంలోనే ఉపయోగించారనేందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను విలేకరులకు చూపిస్తూ వివరించారు. దేవదేవుడితో చంద్రబాబు ఆడుతున్న క్షుద్ర రాజకీయాలను వైఎస్‌ జగన్‌ ఉతికి ఆరేశారు. ‘‘ప్రతి ఒక్కరూ ఈ ఆధారాలు చూడాలి. 

చంద్రబాబు ఎలాంటి వ్యక్తి,. ఈ మనిషిని సీబీఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న సంస్థ వచ్చి విచారించి. జైలుకు పంపినా ఈయన  చేసిన తప్పులకూ మోసాలకూ అబద్ధాలకూ ప్రక్షాళన జరుగుతుందో లేదో ప్రజలే అర్థం చేసుకోవాలి’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సాక్ష్యాధారాలను చూపుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

ఇందాపూర్‌ వెనుక.. బాబు కుట్ర బట్టబయలు.. ఇవిగో సాక్ష్యాలు..
»  2026, ఫిబ్రవరి 10న హెరిటేజ్‌ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ మాన్యుఫ్యాక్చరింగ్‌(తయారీ) యూనిట్‌గా ఇందాపూర్‌ డెయిరీని పేర్కొంది.  

»   దీనిపై తీవ్ర స్థాయిలో దుమారం రేగడంతో.. ఫిబ్రవరి 15న హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లో ఇందాపూర్‌ డెయిరీని కోృమాన్యుఫ్యాక్చరర్‌(సహ తయారీదారు)గా మార్చేశారు. ఇక్కడ ఆరోపణలు వచ్చిన ఐదు రోజుల్లోనే అధికారిక వెబ్‌సైట్‌లో హెరిటేజ్‌ డేటా మార్చేసింది. 

»   2026, ఫిబ్రవరి 14న  హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌కు చెందిన వైస్‌ ప్రెసిడెంట్, నేషనల్‌ సేల్స్‌ హెడ్‌ మకరంద్‌ శాస్త్రి ఉద్యోగం నుంచి తప్పుకున్నారు కాదు.. తొలగించారు. 

»  2015, ఆగస్టు 24న  చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్‌ యూనిట్‌కు చెందిన మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్‌ డెయిరీని తీసుకొచ్చారు. అప్పట్లో ఈ సంస్థ కిలో నెయ్యి సరఫరాకు రూ.278 కోట్‌ చేస్తూ టెండర్లు దక్కించుకుంది.  

» 2016, మార్చి 18న ఇందాపూర్‌ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై టీటీడీ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో నాణ్యత లేదని తేలింది. దాంతో  ఇందాపూర్‌ డెయిరీపై టీటీడీ అనర్హత వేటు వేసింది. అంటే, నెయ్యి కల్తీ జరిగిందనేగా అర్థం.  

»  ఇందాపూర్‌ డెయిరీపై అనర్హత వేటు పడిన కొద్ది రోజులకే అంటే 2016, ఏప్రిల్‌ 26న మళ్లీ ఆ డెయిరీకి అర్హత కల్పించి.. టెండర్లలో  కిలో నెయ్యి రూ.340కి సరఫరా చేస్తామని పేర్కొంటూ బిడ్డింగ్‌లో పాల్గొంది.  

»  2018, నవంబర్‌ 27న  హెరిటేజ్‌ మానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఇందాపూర్‌కు టెండర్‌ దక్కింది. కిలో నెయ్యి రూ.321కి సరఫరా చేసేలా ఇందాపూర్‌ డెయిరీకి టీటీడీ అర్డర్‌ ఇచ్చింది. 

»  2025, డిసెంబర్‌ 16న  ఇదే ఇందాపూర్‌ డెయిరీ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌కు 2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే గతంలో కిలో నెయ్యికి రూ.321 కోట్‌ చేస్తే.. ఇప్పుడు ఏకంగా రూ.658కి టెండర్‌ వేసింది. ఇదే హెరిటేజ్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఇందాపూర్‌ చక్రంతిప్పి భారీగా రేటు కోట్‌ చేసింది.  

» చంద్రబాబు పథకం ప్రకారం ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించి..  రూ.300కి నెయ్యి దొరుకుతుందా? అంటూ  టెండర్లలో పాల్గొనకుండా  అందరినీ భయపెట్టి.. చివరకు రూ.658కి ఆయన సంబంధించిన కంపెనీకి ఆర్డర్‌ ఇచ్చేసుకున్నారు.

» ఏ ప్రభుత్వంలోనైనా టీటీడీలో టెండర్లు ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు. అందులో ఎల్‌ృ1 వచ్చినవారికి ఆర్డర్‌ ఇచ్చి నెయ్యిని తీసుకుంటారు.  టీటీడీకి నెయ్యి సరఫరా  చేసేవాళ్లు దేశంలోని మిగిలిన గుళ్లకు సరఫరా చేస్తారు. గుడికి వచ్చే ప్రతి ట్యాంకర్‌ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన ల్యాబ్‌ నుంచి అక్రెడిటెడ్‌ రిపోర్టుతో గుడికి రావాలి. కేంద్ర ప్రభుత్వ గుర్తింపుతో ఉండే ల్యాబ్ రిపోర్టును తెచ్చుకోవాలి. అది టీటీడీ విధానం. మా ప్రభుత్వంలోనే కాదు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. ఆ రిపోర్టు తీసుకొచ్చి తర్వాత కూడా టీటీడీ ల్యాబ్‌లో మళ్లీ టెస్టు చేస్తారు. ఇక్కడ కూడా టెస్టు పాసైతేనే లోనికి పంపిస్తారు.

భోలేబాబాను తెచ్చింది చంద్రబాబే..
»  భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ మిల్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..  గతంలో హర్‌‡్ష డెయిరీ ప్రైవేటు లిమిటెడ్‌గా ఉండేది. 2018, జూన్‌ 26న చంద్రబాబు ప్రభుత్వంలో ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీకి సాంకేతిక అనుమతి(టెక్నికల్‌గా క్వాలిఫై) ఇస్తూ  టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. స్వయంగా బోలేబాబా ప్లాంట్‌ను పరిశీలించి టీటీడీ వాళ్లు  టెక్నికల్లీ క్వాలిఫైగా నిర్ధారించారు.  

» 2019, మార్చి 6న  భోలేబాబా డెయిరీకి చంద్రబాబు సర్కార్‌ హయాంలోనే 82వేల కేజీల ఆవు నెయ్యి సరఫరాకు ఆర్డర్‌ ఇచ్చారు. ఇదే భోలేబాబా తాము హెరిటేజ్‌ తో అసోసియేట్‌ అయినట్టు ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఇండియా మార్ట్‌లో స్వయంగా తెలిపింది.  ఇప్పడు టీడీపీ బ్యాచ్‌ భోలేబాబా రాజస్థాన్‌ది.. ఉత్తరాఖండ్‌ది కాదు అంటారు. హెరిటేజ్‌ హైదరాబాద్‌.. అయినా విజయవాడ అయినా రెండూ ఒకటేకదా? ఆ ఉత్తరాఖండ్‌ భోలేబాబా ప్లాంట్‌కు వీళ్లే సిబ్బందిని పంపించి, క్వాలిఫై చేయించి ఆర్డర్లు ఇచ్చారు.

కల్తీ నెయ్యి పాపం చంద్రబాబుదే..
»   మార్చి 16, 2024లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.  
»    మే 13, 2024న  పోలింగ్‌ జరిగింది.  
»   పోలింగ్‌ జరిగిన రెండు రోజుల తర్వాత మే 15న 2024లో టెండర్లను ఓపెన్‌ చేశారు.  
»    జూన్‌ 4, 2024 ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం మారింది.  
»    చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌ 12న ఏఆర్‌ డెయిరీ నెయ్యి సరఫరా ప్రారంభించింది.  
»  2024, జూన్‌ 12, 20, 25, జూలై 4న  4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసింది. ఆ నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాసయ్యాయి.  
» 2024, జూలై 6, 12న మరో 4 ఏఆర్‌ డెయిరీ నెయ్యి ట్యాంకర్లు సరఫరా చేయగా.. నాణ్యతపై టీటీడీ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షలలో ఫెయిల్‌(నాణ్యత లేదని) అయ్యాయి. 
»   జూలై 23, 2024లో ఎన్‌డీడీబీ రిపోర్టు వచ్చింది. 2024, జూలై 25న నాణ్యత లేని ఆ నాలుగు ట్యాంకర్లను  వెనక్కి పంపించారు.
»   2024, జూలై 27లో శ్రీకాళహస్తిలోని ఓ క్రషర్‌ యూనిట్‌ సమీపంలో ట్యాంకర్లను రహస్యంగా పార్కు చేశారు. తిరస్కరించిన  నాలుగు ట్యాంకర్లు మళ్లీ ఆగస్టు–­సెప్టెంబర్‌లో ఉదయం 4 గంటల సమయంలో రహస్యంగా టీటీడీలోకి తిరిగి వచ్చాయి. సెప్టెంబర్‌ 18న టీటీడీ అభ్యంతరం చెప్పకుండా ఆ నెయ్యిని తీసుకుంది. వాటిని వాడారు.  ఆ తర్వాత  సెపె్టంబర్‌ 18న ఆ నెయ్యిలో చంద్రబాబు జంతువుల కొవ్వు, చేప నూనె, బీఫ్‌ ఉందని ఆరోపణలు చేశారు.

అసలు టెండర్లు ఎప్పుడు పిలిచారు? నెయ్యి ఎప్పుడు సరఫరా  అయ్యింది? శ్యాంపిళ్లు ఎప్పుడు రిజెక్టు అయ్యాయి? రిజెక్టయిన ట్యాంకర్లు  ఎప్పుడు వెనక్కి వెళ్లాయి. అవి తిరిగి వెనక్కి ఎప్పుడు వచ్చాయి? వచ్చి న ఆ నెయ్యి టీటీడీలో ఎప్పుడు, ఎలా వాడారు. అన్నీ చంద్రబాబు హయాంలో జరుగుతున్నప్పుడు వైఎస్సార్‌ సీపీకి ఏం సంబంధం? గంపగుత్త కింద ఏ రకంగా దీన్ని మా ప్రభుత్వానికి లింకు పెడతారు. అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు హయాంలోనే కనిపిస్తున్నాయి. 

వీళ్లు వచ్చిన దగ్గర నుంచి వారి హయాంలో సప్లై చేయడం, టెస్టు శాంపిళ్లు ఫెయిల్‌ అయినా నెయ్యి టీటీడీలోకి వస్తుంటే చంద్రబాబు ఎందుకు 2019తో ఆపుతున్నారు. 2014 వరకు విచారణ ఎందుకు చేయట్లేదు? టీటీడీలో ఓ రోబస్ట్‌ ప్రొసీజర్‌ ఉంది. ప్రతి ట్యాంకర్‌ అక్రెడిడేటెడ్‌ ల్యాబ్‌ రిపోర్టు తీసుకుని రావాలి.  అప్పుడే ట్యాంకర్‌ను టీటీడీలోకి రానిస్తారు. టీటీడీ అక్కడితో సంతృప్తి చెందకుండా మళ్లీ సొంత ల్యాబ్‌లో టెస్టు చేసి అప్పుడు పాస్‌ అయితేనే నెయ్యి ట్యాంకర్లను పైకి పంపిస్తారు. 

చంద్రబాబు హయాంలో 15 సార్లు, వైఎస్సార్‌ సీపీ హయాంలో 18 సార్లు ఇలా రిజెక్టు చేసి పంపించాం. అలాంటప్పుడు ఏ రకంగా గంపగుత్త కింద వైఎస్సార్‌ సీపీపై బురద జల్లు­తారు. తప్పు జరిగింది చంద్రబాబు హయాంలో. రిజెక్టు చేసిన ట్యాంకులు మళ్లీ వెనక్కి తీసుకు వాడింది చంద్రబాబు. ఇది సీబీఐ చార్జీ షీట్‌లో చెప్పింది. సీబీఐ సిట్‌ ఫైనల్‌ చార్జీషీట్‌ పేజీ 44, 64, 91 లో స్పష్టంగా కనిపిస్తుంది. 

అలాగే సీబీఐ సిట్‌ చార్జిషీట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌ 2013 నుంచి ఉంది. 2014–19 మధ్య వరుసగా చంద్రబాబు హయాంలో టెండర్లు దక్కించుకుంది. మరోవైపు ఈ విడత చంద్రబాబు సీఎం అయిన తర్వాత టెండర్లలో మళ్లీ పాల్గొంది. బోలేబాబా, ఇందాపూర్‌ హెరిటేజ్‌ కనెక్షన్లు మాదిరిగానే ఇది కూడా. చంద్రబాబు ఇప్పుడు వచ్చి న తర్వాత నెయ్యి సరఫరా రేట్లు మారిపోయాయి. 

అప్పుడు 270–320 కి సప్లై చేస్తే ఇప్పుడు ఏకంగా రూ.658కి కోట్‌ చేస్తున్నారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, హెరిటేజ్‌ సంస్థ తప్పు చేసినట్టు ప్రస్ఫుటంగా తెలుస్తోంది. నాలుగు వేళ్లు వారి వైపు ఉంటే ఒకవేలు ఇతరుల వైపు చూపిస్తున్నారు. చంద్రబాబు అబద్ధాలాడి దేవుడితో చెలగాటడారు. ఆ దేవుడే మొట్టికాయలు వేస్తున్నారు.

దేవదేవుడికి ఏడుకొండలు చెందుతాయని జీవోలు ఇచ్చిందే నాన్న.  
జీవో నంబర్‌ 746, 747 వైఎస్సార్‌ ఇచ్చారు. 350 కిలో మీటర్ల పరిధిని పెంచారు. తిరుమలకొండపైన, మిగిలిన 19 దేవాలయాల్లోనూ అన్యమత ప్రార్థనలు జరగకుండా జీవోలు ఇచ్చింది కూడా వైఎస్సార్‌గారే. అప్పుడు ఇదే చంద్రబాబు బీజేపీతో లేడు కాబట్టి ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్ల కోసం ఆ జీవోలను రద్దు చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు ఏ పార్టీతో ఉంటే ఆ పాట పాడతారు. ఆ పార్టీ వద్దు అనుకుంటే వేరే విధంగా ప్లేటు మారుస్తారు. అప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలతో ఇప్పుడు చంద్రబాబు మాటలను పోల్చి చూస్తే ఆయన క్యారెక్టర్, నైజం అర్థం అవుతాయి.  

తిరుమల ఏడుకొండలు తిరుమలకే చెందుతాయని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన జీవో నంబర్లు రద్దు చేస్తానని 
చంద్రబాబు చెబుతున్న వీడియోను ప్రదర్శించిన వైఎస్‌ జగన్‌ 


ఇందాపూర్‌ డెయిరీ రూపంలో బయటపడ్డ చంద్రబాబు కుట్ర



గుట్టు బయటపడ్డాక...  
15–2–2026న హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లోనే కో–మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌గా మారిన ఇందాపూర్‌ డెయిరీ 

రాజీనామా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement